ఆ ప్రచారంలో నిజం లేదు... పార్టీ ఆదేశాల మేరకు

ఆ ప్రచారంలో నిజం లేదు... పార్టీ ఆదేశాల మేరకు

వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేస్తున్నారన్న వార్తలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 12 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీగా గెలుపొందానని  అందరి బాగోగులు చూసే వ్యక్తినని అన్నారు. జనగామ ఎమ్మెల్యే టికెట్‌ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. పార్టీ ఆదేశాల మేరకు జనగామలో ఇన్‌చార్జ్‌గా పని చేశానని తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నాయకత్వంలో జనగామ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఎమ్మెల్యేకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడుస్తున్నానని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డితో సైతం తనకు అనుబంధం ఉందన్నారు.

 

Tags :