ASBL NSL Infratech

ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం... ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం... ప్రారంభించనున్న ప్రధాని మోదీ

యూఏఈలోని అబూదాబీలోగల ఎడారి భూభాగంలో అద్భుత హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దివ్యమైన ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14 ప్రారంభించనున్నారు. ప్రస్తుత ఆలయ నిర్మాణం చివరి దశలో ఉంది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 13న అబూదాబీలోని షేక్‌ జాయద్‌ స్టేడియంలో హమ్లన్‌ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను కలుసుకుని, వారితో సంభాషించనున్నారు. దీని తరువాత ఫిబ్రవరి 14న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా 34 దేశాలకు చెందిన ప్రతినిధులు సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. యూఏఈలోని భారత రాయబారి సుధీర్‌కు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందింది. ఈ దేవాలయాన్ని పశ్చిమ ఆసియాకు చెందిన రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి రూ.700 కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చింది. అద్భుత కళాకృతులను ఆలయం అంతటా తీర్చిదిద్దారు. ఆలయానికికి ఏడు గోపురాలను నిర్మించారు. ఈ ఆలయం 27 ఎకరాల్లో నిర్మితమయ్యింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :