ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బద్రినాథ్- కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ కీలక నిర్ణయంపై.. ఇకపై ఆలయంలో

బద్రినాథ్- కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ కీలక నిర్ణయంపై.. ఇకపై ఆలయంలో

ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌నాథ్‌ ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు బద్రినాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ప్రకటిచింది. ఈ మేరకు ఆలయంలో ఫొటోలు/వీడియోలు తీసుకోవడంపై నిషేధం విధించినట్లు తెలిపేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.  కేదార్‌నాథ్‌ ఆలయంలోకి భక్తులు మొబైల్‌ ఫోన్లు తీసుకురావద్దు. ఆలయం లోపల ఫొటోలు/ వీడియోలు తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఆలయంలో సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఆలయ పరిసరాల్లో కొంతమంది భక్తులు ఫొటోలు/ వీడియోలు తీసుకుంటూ అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.  దాంతోపాటు ఆలయాన్ని సందర్శించే భక్తులు నిరాడంబరంగా ఉండేలా దుస్తులు ధరించాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్‌ అజేంద్ర సూచించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :