ASBL NSL Infratech

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక ప్రకటన...

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక ప్రకటన...

అమెరికా ఫార్మా దిగ్గజం కీలక ప్రకటన చేసింది. ఫైజర్‍ ఇంక్‍, జర్మనీకి చెందిన బయో ఎంటెక్‍తో కలిసి 12 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న పిల్లల్లో కొవిడ్‍ వ్యాక్సిన్‍ ట్రయల్స్ ను ప్రారంభించినట్లు చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి టీకాలు అందుబాటులో తేవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ట్రయల్స్ లో భాగంగా వలంటీర్లకు మొదటి డోస్‍ ఇచ్చినట్లు ఫైజర్‍ ప్రతినిధి షరోన్‍ కాస్టిల్లో తెలిపారు. ఫైజర్‍, బయో ఎంటెక్‍ వ్యాక్సిన్‍కు యూఎస్‍ రెగ్యులేటరి అధికారులు డిసెంబర్‍ చివరిలో 16 అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిపై ప్రయోగాలకు అధికారం ఇచ్చారు. ఈ పిడియాట్రిక్‍ ట్రయల్‍ ఆరు నెలల వయస్సులోపు పిల్లలపై చేయనున్నారు.

ప్రస్తుతం అమెరికాలో 16-17 సంవత్సరాల పిల్లలకు ఫైజర్‍ వ్యాక్సిన్‍ వేస్తున్నారు. ఫైజర్‍ రెండు షాట్ల వ్యాక్సిన్‍ను మూడు వేర్వేరు మోతాదుల్లో 10, 20, 30 మెకోగ్రాముల వద్ద 144 మంది చిన్నారులపై రెండు దశల ట్రయల్స్ యోచిస్తోంది. చివరి వరకు 4,500 మందిపై ట్రయల్స్ విస్తరించాలని భావిస్తోంది. టీకా ద్వారా ఉత్పన్నమయ్యే భద్రత, సహనం, రోగ నిరోధక ప్రతి స్పందనను పరిశీలించనున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :