ASBL NSL Infratech

టెన్త్ ఫలితాల నడుమ.. వైరల్ అవుతున్న పవన్ ఎడ్యుకేషన్..

టెన్త్ ఫలితాల నడుమ.. వైరల్ అవుతున్న పవన్ ఎడ్యుకేషన్..

తెలుగు రాష్ట్రాలలో ఒకపక్క ఎన్నికల హడావిడి నెలకొని ఉంటే.. మరోపక్క టెన్త్ ఫలితాల హడావిడి కూడా ఉంది. ఏపీలో ఇటీవల ఇంటర్, టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే అనూహ్యంగా ఈ రిజల్ట్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ చదువు గురించి డిస్కషన్ మొదలైంది. నిజానికి ఈ రిజల్ట్స్ కి పవన్ కి ఎటువంటి సంబంధం లేదు.. కానీ గతంలో జగన్ గురించి.. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ గురించి పవన్ పలు సందర్భాలలో ప్రస్తావించారు. సరియైన సమయం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ అభిమానులు ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేశారు. గతంలో పలు సందర్భాలలో పవన్ తన చదువు గురించి మాట్లాడినప్పుడు టెన్త్, ఇంటర్, కంప్యూటర్స్ డిప్లమా అని పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఆ పాత వీడియోలను వెలికి తీసిన నెటిజన్లు.. పవన్ తన నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో పోల్చి హడావిడి చేస్తున్నారు. ఫైనల్ గా ఆయన చదివింది టెన్త్ క్లాస్ మాత్రమే అని స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో 1984వ సంవత్సరం తాను టెన్త్ క్లాస్ పూర్తి చేసినట్టు క్లియర్ అయింది. అంటే మిగిలిన ఇంటర్వ్యూలలో పవన్ చెప్పింది అబద్ధమే కదా అంటూ నటిజెన్లు అతనిపై మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :