ASBL NSL Infratech

పాక్ నూతన ప్రభుత్వ రథసారథి నవాజ్ షరీఫ్..?

పాక్ నూతన ప్రభుత్వ రథసారథి నవాజ్ షరీఫ్..?

పాకిస్తాన్ లో ఫలితాల సరళి చూస్తుంటే.. ఏపార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ముఖ్యంగా జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని నేతృత్వంలోని పీటీఐ పార్టీ అనుకూలురు.. అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తున్నప్పటికీ ఆపార్టీకి అధికారం దక్కడం సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే.. వీరందరూ ఇండిపెండెంట్లుగా విజయాలు సాధించారు. అందరికీ ఒకే గుర్తు లేదు. వీటన్నింటికీ మించి ఇమ్రాన్ ఖాన్ అంటే పాక్ ఆర్మీకి పడదు. అందుకే ఆయన ఇప్పటికే పలుకేసుల్లో జైల్లో ఉన్నారు.

ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీఎంఎల్(ఎన్) పార్టీ చీఫ్ నవాజ్ షరీఫ్.. తిరిగి పాకిస్తాన్ రావడం వెనక పాక్ ఆర్మీ హస్తముందని ఎవరినడిగినా చెబుతారు. ఎందుకంటే పలు కేసులను ఎదుర్కొంటూ విదేశాల్లో ఆశ్రయం పొందిన నవాజ్.. తిరిగి రావడానికి పాక్ ఆర్మీ అనుమతి లభించిందనే చెప్పాలి. ఇప్పుడు అదే ఆర్మీ.. నవాజ్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంది. దీంతో పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టే పరిస్థితిని ఆర్మీ తప్పక సృష్టిస్తుందని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఇక బిలావల్ పార్టీకి తగిన మెజార్టీ లేదు. అందువల్ల నవాజ్ షరీఫ్ కు అధికారం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక పదవి షరీఫ్ కు దక్కినా ... స్టీరింగ్ తిప్పేది పాకిస్తాన్ ఆర్మీనే. ఎందుకంటే, పాక్ ఆర్మీ అండదండ లేకుండా ఏ పార్టీ పాక్ లో ప్రభుత్వాన్ని నడపలేదు.అయితే ఇప్పుడు పూర్తిగా ఆర్మీకి సరెండర్ కావాల్సిన పరిస్థితుల్లో పాక్ పార్టీలున్నాయి. ఫలితంగా ఇది మరోసారి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వని పరిణామంగాానే అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెబుతున్నారు. ఇదీ కాక.. పాకిస్తాన్ లో ప్రస్తుతం పౌరసమాజం పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతోంది. ధరలు మేఘాల మీద విహరిస్తున్నాయి. నిరుద్యోగం ప్రబలిపోయింది.

దీనికి తోడు పొరుగున్న తాలిబన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు.. నేరుగా పాక్ ఆర్మీపైనే దాడులు చేస్తున్నాయి. వీటన్నింటినీ కొత్త సర్కార్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు.... పొరుగున ఉన్నభారత్ కు ఇది కాస్త ప్రతికూలాంశమే. ఎందుకంటే పాక్ లో రాజకీయం అనిశ్చితిగా ఉన్నప్పుడల్లా .. ఆర్మీ ప్రోద్బలంతో ఉగ్రవాదులు పేట్రేగారు. మరోసారి అలాంటి పరిణామం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :