ASBL NSL Infratech

టాలీవుడ్ లో ప‌రాయి భాష‌ మ్యూజిక్ డౌరెక్ట‌ర్లు

టాలీవుడ్ లో ప‌రాయి భాష‌ మ్యూజిక్ డౌరెక్ట‌ర్లు

టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ల కొర‌త చాలా ఎక్కువ‌గా ఉంది. థ‌మ‌న్ రేటుని అంద‌రూ భ‌రించ‌లేరు. దేవీ శ్రీ ప్ర‌సాద్ ప్ర‌తి ఆల్బ‌మ్‌కి మంచి మ్యూజిక్ ఇస్తాడ‌ని న‌మ్మ‌కం లేదు. పైగా రెమ్యూన‌రేష‌న్ కూడా ఎక్కువే. మిగిలిన వారిలో మిక్కీ జే మేయ‌ర్ అన్నీ జాన‌ర్ సినిమాల‌కు స‌రిపోయే సంగీతం ఇవ్వ‌లేడ‌ని రీసెంట్‌గా రామ‌బాణం సినిమాతో తేలింది. మ‌నం, ఇష్క్ నాటి మేజిక్ ని అనూప్ రూబెన్స్ ఇవ్వ‌లేక‌పోతున్నాడు. 

అందుకే మన మేక‌ర్స్ ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నారు. ఖ‌ర్చు కొంచెం ఎక్కువైనా స‌రే ఆల్బ‌మ్స్ రాబ‌ట్టుకునేందుకు అస్స‌లు రాజీప‌డ‌ట్లేదు. మ‌ల్లువుడు సెన్సేష‌న్ హేశం అబ్దుల్ వ‌హాబ్ చేతిలో ఖుషి, నాని30 సినిమాలున్నాయి. మంచి అవుట్ పుట్ వ‌స్తోంద‌ని ఆల్రెడీ టాక్ ఉండ‌టంతో పాటుగా రీసెంట్‌గా ఖుషి సినిమా నుంచి వ‌చ్చిన సాంగ్ ఆ విష‌యాన్ని నిరూపించింది కూడా. 

అనిరుధ్ ఎంత బిజీగా ఉన్నా స‌రే ఎన్టీఆర్30, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ 12కు క‌మిట్‌మెంట్ ఇచ్చాడు. ద‌స‌రాతో హిట్ అందుకున్న సంతోష్ నారాయ‌ణ‌న్ ఏకంగా ప్రాజెక్ట్ కె, వెంక‌టేష్ సైంధ‌వ్‌కు వ‌ర్క్ చేస్తున్నాడు. క‌స్టడీ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన యువ‌న్ శంక‌ర్ రాజాకు మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ఉంది. నితిన్- వ‌క్కంతం వంశీ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాకు హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మంగ‌ళ‌వారం సినిమాకు అజ‌నీష్ లోక‌నాథ్ను ఒప్పించాడు. ఇది కాక మ‌రో రెండు డిస్క‌ష‌న్ లో ఉన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :