ASBL NSL Infratech

న్యూజెర్సీలో ఫిఫా ప్రపంచకప్ ఫైనల్

న్యూజెర్సీలో ఫిఫా ప్రపంచకప్ ఫైనల్

2026 ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు న్యూజెర్సీ వేదికగా నిలవనుంది. జులై 19న ఈ తుది పోరు జరగనుంది. 48 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ జూన్‌ 11న ఆరంభం కానుంది. 2010లో ప్రారంభమైన ఈ స్టేడియం సామర్థ్యం 82,500. తొలిసారి మూడు దేశాలు ( అమెరికా, కెనడా, మెక్సికో) సాకర్‌ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈ టోర్నీలో జరిగే 104 మ్యాచ్‌ల్లో 78 అమెరికాలోనే నిర్వహించనున్నారు. ఇందుకు 11 నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కెనడా, మెక్సికో పదమూడు మ్యాచ్‌లు చొప్పున నిర్వహిస్తాయి. వీటిలో పదేసి క్యాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ మెక్సికోలో జరగనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :