ASBL NSL Infratech

దూత ఆచూకీ ఏమైంది చైతూ?

దూత ఆచూకీ ఏమైంది చైతూ?

జోష్ సినిమాతో త‌న కెరీర్‌ను ప్రారంభించిన చైతూకి మొద‌టి నుంచి కూడా ఒడిదొడుకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. ఏ మాయ చేశావే సినిమాతో మొద‌టి హిట్ కొట్టిన చైతూ, మ‌ళ్లీ త‌ర్వాత త‌డ‌బ‌డ్డాడు. ఒక సినిమా హిట్ కొట్ట‌డం, త‌ర్వాత డిజాస్ట‌ర్ ఎదుర్కోవ‌డం చైతూకు అల‌వాటైంది. అలా అయిన ప్ర‌తీసారి ఓ ల‌వ్‌స్టోరీతో వ‌చ్చ మంచి హిట్ అందుకుంటాడు. ల‌వ్‌స్టోరీ లాంటి మంచి క్లాస్ సినిమా త‌ర్వాత థాంక్యూ అంటూ ఓ సినిమా చేసి అంద‌రినీ నిరాశ‌ప‌రిచాడు చైతూ.

మే లో క‌స్ట‌డీ సినిమాతో చైతూ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమా రిజ‌ల్ట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చైతూ రెండేళ్ల కింద‌ట దూత అనే వెబ్ సిరీస్ ను మొద‌లుపెట్టిన విష‌యం అంద‌రికీ తెలుసు. ఆ సినిమా మేకింగ్ ద‌శ‌లో ఉన్న‌ప్పుడే దూత కు మంచి బ‌జ్ ఏర్ప‌డింది.

ఈ సిరీస్ విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రావ‌డం దీనికి ఓ కార‌ణం కాగా, ఇప్ప‌టికే వారి కాంబోలో మ‌నం సినిమా రావ‌డం మ‌రో కార‌ణం. దీంతో పాటూ దూత అనే టైటిల్, దానికి సంబంధించిన ప్రోమోలు అందరినీ ఆక‌ట్టుకున్నాయి. గ‌తేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సిరీస్ అస‌లు ఏమైందో తెలీదు కానీ దాని ఆచూకీనే చెప్ప‌ట్లేదు. 

ఇప్ప‌టికే ప్రైమ్ వాళ్లు దీన్ని పూర్తి చేయించాల్సింది కానీ దూత విష‌యంలో వాళ్లెందుకు ఆల‌స్యం చేస్తున్నారనేది తెలియట్లేదు. బ‌జ్ ఉన్న సినిమాలు కానీ, సిరీస్ లు కానీ ఇలా లేట్ చేస్తే దాని మీద ఉన్న ఆస‌క్తి క్ర‌మంగా త‌గ్గి, మొద‌టికే మోసం అవుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :