ASBL NSL Infratech

నాటు నాటు లైవ్ పెర్ఫామెన్స్‌ కు స్టాండింగ్ ఓవెషన్ (STANDING OVATION)

నాటు నాటు లైవ్ పెర్ఫామెన్స్‌ కు స్టాండింగ్ ఓవెషన్ (STANDING OVATION)

95వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్సం షురూ అయ్యాయి. ఈ వేడుక‌ల్లో అవార్డ్స్ సెర్మ‌నీ స్టార్ట్ కావటానికి ముందే నాటు నాటు సాంగ్‌ను స్టేజ్‌పై లైవ్ పెర్ఫార్మ్ చేసారు. తొలిసారి ఆస్కార్ వేడుక‌లో తెలుగు సినిమా పార్ట్ కావ‌టం మ‌న‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా ఉంది. RRR మూవీ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమొంటే.. ఆస్కార్ వేడుక‌ను ప్రారంభించ‌టానికి ముందే నాటు నాటు పాట‌ను వేదిక‌పై ప్ర‌ద‌ర్శించారు. ఆస్కార్ వేదిక‌పై ఓ తెలుగు పాట‌కు లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌టం ఇదే తొలిసారి.  నాటు నాటు లైవ్ పెర్ఫామెన్స్‌లో రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ పార్ట్ అయ్యారు. నిజానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ లైవ్ పెర్ఫామెన్స్‌లో భాగ‌మ‌వుతార‌ని అంద‌రూ భావించారు. కానీ త‌గినంత స‌మ‌యం లేక‌పోవ‌టంతో వారిద్ద‌రూ చేయ‌లేక‌పోయారు. వారి స్థానంలో అమెరికన్ డాన్సర్ అయిన లారెన్ గోట్లిబ్ ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు సాంగ్‌ను పెర్ఫామ్ చేశారు. వారి ప్ర‌ద‌ర్శ‌న‌కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే అప్లాజ్ వ‌చ్చింది. ఈ పాట‌కు సంబంధించిన ఇంట్ర‌డక్ష‌న్‌ను దీపికా పదుకొనె ఇవ్వ‌టం కొస‌మెరుపు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :