ASBL NSL Infratech

ముకేశ్ అంబానీ అరుదైన ఘనత.. 100 బి.డాలర్ల క్లబ్ లో

ముకేశ్ అంబానీ అరుదైన ఘనత.. 100 బి.డాలర్ల క్లబ్ లో

100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్లు) సంపద కలిగిన సంపన్నుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చేరారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు తాజా రికార్డు గరిష్ఠాలకు చేరడం ఇందుకు కలిసొచ్చింది. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ సంపన్నుల జాబితా ప్రకారం ముకేశ్‌ అంబానీ సంపద 105.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఆయన 11వ స్థానంలో ఉన్నారు. ఇక దేశీయంగా, ఆసియాలో అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ జాబితాలో 100 బి.డాలర్ల సంపద కలిగిన వారు 12 మంది మాత్రమే ఉన్నారు. గౌతమ్‌ అదానీ 16వ స్థానంలో నిలిచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :