ASBL NSL Infratech

ముకేశ్ అంబానీ మరో ఘనత.. ప్రపంచంలోనే రెండో స్థానంలో

ముకేశ్ అంబానీ మరో ఘనత.. ప్రపంచంలోనే రెండో స్థానంలో

సంపద సృష్టిలోనే కాదు, బ్రాండ్‌ ఇమేజీ సృష్టికర్తగానూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి తన సత్తా చాటారు. బ్రాండ్‌ ఫైనాన్స్‌ అనే సంస్థ ప్రపచంలోని మేటి సంస్థల సీఈఓలతో రూపొందించిన బ్రాండ్‌ గార్డియన్‌ షిప్‌ ఇండెక్స్‌-2024లో ముకేశ్‌ అంబానీకి మన దేశం నుంచి ఒకటో స్థానం, ప్రపంచ సీఈవోల జాబితాలో రెండో స్థానం దక్కింది. అంబానీ ఈ ఇండెక్స్‌లో రెండో స్థానం సంపాదించడం వరుసగా ఇది రెండో సంవత్సరం. చైనా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం టెన్సెంట్‌ చీఫ్‌ హాటెంగ్‌ మా కేవలం 13 శాతం అధిక స్కోరుతో అంబానీని తోసిపుచ్చి ప్రథమ స్థానంలో నిలిచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :