ASBL NSL Infratech

భారతీయులందరూ గర్వపడే క్షణాలు..స్టేజ్ పై ప్రకటన రాగానే గూజ్ బమ్స్ వచ్చాయి: చిరంజీవి

భారతీయులందరూ గర్వపడే క్షణాలు..స్టేజ్ పై ప్రకటన రాగానే గూజ్ బమ్స్ వచ్చాయి:  చిరంజీవి

ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గురించి తెలిసింది. నాటు నాటు లైవ్ పెర్ఫామెన్స్‌కి అంద‌రూ స్టాండింగ్ ఒవేష‌న్ ఇవ్వ‌టం చూస్తే గూజ్ బ‌మ్స్ వ‌చ్చాయి’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి.ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ వ‌చ్చింది. తెలుగు సినిమా చ‌రిత్రలో ఆస్కార్ ద‌క్కించుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. నాటు నాటు పాట ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ విన్న‌ర్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .." ఆర్ఆర్ఆర్ కి  ఆస్కార్ రావ‌టం చాలా సంతోషంగా ఉంది. ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డాల్సిన క్ష‌ణాలివి. రాజ‌మౌళిగారికి, కీర‌వాణిగారికి, పాట రాసిన చంద్ర‌బోస్‌గారికి, తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ స‌హా అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

చారిత్రాత్మ‌క కీర్తిని ఇండియ‌న్ సినిమాకు తీసుకొచ్చిన విజ‌న‌రీ ఉన్న డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి ప్ర‌త్యేకించి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. అందులో చ‌ర‌ణ్ కూడా ఓ పార్ట్ కావ‌టం అనేది మా ఫ్యామిలీకి, మాకు గ‌ర్వ‌కార‌ణంగా ఉంది. నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ రావ‌టం అనేది గొప్ప విషయం. ఆ క్రెడిట్ చ‌ర‌ణ్‌కి మాత్రం ఇవ్వ‌టం క‌రెక్ట్ కాదు. అంద‌రికీ చెందుతుంది. ఆస్కార్‌కి తీసుకెళ్ల‌టానికి చాలా మంది కృషి చేశారు. ప్ర‌పంచానికి మ‌న దేశం గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా ఆర్ఆర్ఆర్ ను రూపొందించారు. అంద‌రూ ఎంతో శ్ర‌ద్ధాస‌క్తుల‌తో ప‌ని చేశారు. అవ‌న్నీ క‌లిసే మ‌న‌కు అవార్డు ల‌భించ‌టానికి కార‌ణంగా మారాయి. ఆస్కార్ అవార్డ్ వ‌స్తుంద‌ని చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నాం. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డ్ వ‌చ్చింది. స్టేజ్‌పై నాటు నాటుకి లైవ్ పెర్ఫామెన్స్‌కి ఆస్కారం ఇచ్చారు. అలా ఆస్కారం ఇచ్చారంటే ఆస్కార్‌కి ఆస్కారం ఉంద‌నే నేను భావించాను. లోప‌ల తెలియ‌ని టెన్ష‌న్ ఉండింది. జెన్యూన్‌గా కొన్ని కార‌ణాల‌తో మ‌రెవ‌రికైనా ఇస్తార‌మో అనుకున్నా.. అలా ఇవ్వొచ్చు. ఎవ‌రికీ ఇచ్చినా సంతోషమే.

కానీ మ‌నకు ఆస్కార్ రావ‌టం అనేది చారిత్రాత్మ‌క‌ గొప్ప విజ‌యంగా నేను భావిస్తున్నాను. కొడుకు ఉన్న‌త స్థాయికి ఎదుగుతుంటే తండ్రిగా ఆనంద ప‌డుతున్నాను. ఇక సినిమా వాడిగా రాజమౌళిగా నేను తీసుకున్న శ్రద్ధాసక్తులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గర్వపడుతున్నాను. ఒకప్పుడు ఇండియాలోనే తెలుగు అనేది ఒక‌టుంద‌ని తెలిసేది కాదు. శంక‌రాభ‌ర‌ణం వంటి కొన్ని సినిమాల కార‌ణంగా మ‌ద్రాసీల‌నే స్థాయి నుంచి తెలుగు సినిమా ఉంద‌నేది తెలిసింది. మ‌న‌కు రావాల్సిన గుర్తింపు రాలేద‌ని నేను కూడా చాలా సార్లు చెప్పాను’’ అని అన్నారు. ఆర్ఆర్ఆర్. ఆస్కార్ విజేత‌గా నిలిచింది. నాటు నాటు పాట‌ను ఆస్కార్ అవార్డ్ వ‌రించింది. ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో నాటు నాటుకి ఈ అవార్డు రావ‌టంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది".   దీనిపై యావత్ తెలుగు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అభినందనలను తెలియజేస్తున్నారు.

https://twitter.com/KChiruTweets/status/1635113500875051009

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :