చైనీయులను అధిగమించి భారతీయులు.. తొలిసారిగా రికార్డు

చైనీయులను అధిగమించి భారతీయులు.. తొలిసారిగా రికార్డు

బ్రిటన్‌లో విద్యార్థి వీసాలను దక్కించుకోవడంలో భారతీయులు తొలిసారిగా చైనీయులను అధిగమించి రికార్డు సృష్టించారు. 2022 సెప్టెంబరుతో ముగిసిన ఏడాది కాలానికి మొత్తం 1,27,731 మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్‌ వీసాను పొందారు. 2019 నాటితో పోలిస్తే ఆ సంఖ్య ఏకంగా 73 శాతం అధికం కావడం విశేషం. 2022 సెప్టెంబరుతో పూర్తయినే ఏడాది కాలంలో 1,16,476 మంది చైనా విద్యార్థులు బ్రిటన్‌ వీసా దక్కించుకున్నారు. నిపుణులైన కార్మికుల విభాగంలో గత ఏడాది కాలంలో బ్రిటన్‌ అత్యధిక వీసాలు మంజూరు  చేసిందీ భారతీయులకే. 56,042 మంది భారతీయలు వాటిని పొందారు. ఈ విభాగంలో 36 శాతం వీసాలు భారత్‌ ఖాతాలోనే వెళ్లాయి. గ్రాడ్యుయేట్ల కోసం గత ఏడాది జులైలో బ్రిటన్‌ ప్రవేశపెట్టిన ప్రత్యేక వీసా పథకంలోనూ భారతీయులే సింహభాగం (41 శాతం) దక్కించుకున్నారు.

 

Tags :