ASBL NSL Infratech

విజ‌య్‌తో గోపీచంద్ మ‌లినేని సినిమా

విజ‌య్‌తో గోపీచంద్ మ‌లినేని సినిమా

సినిమా రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా వంద కోట్ల వ‌సూళ్లు ఈజీగా సాధిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ కు మ‌న తెలుగు డైరెక్ట‌ర్ల మీద మంచి న‌మ్మ‌కం కుదురుతుంది. వారసుడు తెలుగు వెర్ష‌న్ ఫ‌లితం ఎలా ఉన్నా దాన్ని వంశీ పైడిప‌ల్లి హ్యాండిల్ చేసిన విధానం బాగా న‌చ్చిన విజ‌య్, వెంట‌నే మ‌రో స్టోరీని రెడీ చేసుకుని ర‌మ్మ‌ని చెప్పాడు విజ‌య్.

ఈ సినిమా గురించి ఇంకా అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు కానీ స్టోరీ ఫైన‌ల్ అయితే వెంట‌నే సినిమాను అనౌన్స్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్, లోకేష్ క‌న‌గ‌రాజ్ తో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగ‌స్ట్ నెలాఖ‌రుకు పూర్తి కానుంది. ఈ క్ర‌మంలోనే మ‌రో టాలీవుడ్ డైరెక్ట‌ర్కి విజ‌య్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గోపీచంద్ మ‌లినేని చెప్పిన ఓ లైన్ న‌చ్చ‌డంతో సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. క్రాక్, వీరసింహా రెడ్డి సినిమాలు విజ‌య్ కు న‌చ్చడంతో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్స్ పెరిగిందని అంటున్నారు. ఈ డీల్‌కు దిల్ రాజు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించినట్లు స‌మాచారం. ఇప్పటివ‌ర‌కు తెలుగు సినివిమాలు మాత్ర‌మే చేసిన మ‌లినేని, టాలీవుడ్ స్టార్ హీరోలు ఖాళీగా లేక‌పోవ‌డంతో విజ‌య్‌ను లైన్‌లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజ‌మైతే మాత్రం గోపీచంద్ జాక్‌పాట్ కొట్టిన‌ట్లే. ఎందుకంటే బాల‌య్య రేంజ్ హీరోని డీల్ చేసిన గోపీ, ఇప్పుడు చిన్న హీరోల‌తో కంటిన్యూ చేయ‌లేడు. ఎలాగూ ఇంకో రెండేళ్ల వ‌ర‌కు తెలుగులో ఏ స్టార్ హీరో అందుబాటులో లేక‌పోయేస‌రికి, విజ‌య్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేలా గోపీ ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాను అయిదారు నెల‌ల్లో పూర్తి చేసేలా విజ‌య్ స‌న్నాహాలు చేస్తున్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :