ASBL NSL Infratech

అమెరికా వర్శిటీల్లో నిరసనల హోరు

అమెరికా వర్శిటీల్లో నిరసనల హోరు

అమెరికాలోని విశ్వ విద్యాలయాలు ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనలతో హోరెత్తాయి. గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న నెతన్యాహు ప్రభుత్వానికి బైడెన్‌ ప్రభుత్వం నిధులు, ఆయుధాలు అందజేయడాన్ని విద్యార్థులు నిరసించారు. తూర్పు తీరంలోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ దాకా విద్యార్థులు పాలస్తీనాకు సంఫీుభావం ర్యాలీ నిర్వహించారు. గాజాలో ఇజ్రాయెల్‌ దళాలా చేతుల్లో పిల్లలు, మహిళలు సహా అమాయక పౌరుల మరణానికి బైడెన్‌ ప్రభుత్వమే కారణమని వారు విమర్శించారు. ఈ నిరసనలపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. వందలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :