ASBL NSL Infratech

అమెరికా అధ్యక్ష బరిలో డీశాంటీస్

అమెరికా అధ్యక్ష బరిలో డీశాంటీస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీకి దిగుతున్నట్లు ఆ పార్టీ నేత, ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్‌ రాన్‌ డీశాంటీస్‌ ప్రకటించారు. అమెరికా ప్రగతి నేల చూపులు చూస్తోంది. దీన్ని ఆపడం అసాధ్యమైతే కాదు.  మనకింకా సువర్ణావకాశం ఉంది. మళ్లీ మనం దేశ ప్రగతిని పైకి ఎగసేలా చేద్దాం. ఇది అమెరికా పునర్‌వైభవానికి బాటలు వేస్తుంది అని కుబేరుడు ఎలాన్‌ మస్క్‌తో కలిసి ఆన్‌లైన్‌ ఆడియో చర్చావేదిక ట్విట్టర్‌ స్పేసెస్‌ లో డీశాంటీస్‌ మాట్లాడారు. అయితే ఒక్కసారిగా వేలాదిగా  స్ట్రీమింగ్‌లోకి రావడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో డీశాంటీస్‌ మాట్లాడిరది ఎవరికీ వినపడలేదు. కాగా, పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం  పలువురు పోటీ పడుతుండటం తెల్సిందే. వీరిలో ట్రంప్‌, నిక్కీ హేలీ, భారతీయ మూలాలున్న వ్యాపారి వివేక్‌ రామస్వామి, టిమ్‌ స్కాట్‌, హట్‌చిస్సన్‌ ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :