ASBL NSL Infratech

దుబాయ్ లో ఫుడ్ ఫెస్టివల్

దుబాయ్ లో ఫుడ్ ఫెస్టివల్

ఫుడ్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 11వ దుబాయ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 19 నుండి మే 12 వరకు జరుగనున్న డిఎఫ్‌ఎఫ్‌ 2024 దుబాయ్‌ నగరవ్యాప్తంగా వినూత్నమైన కలినరీ అనుభవాలు, ప్రత్యేక మెనులు ఈవెంట్‌లతో ఆకట్టుకోనుంది. ఈ ఫెస్టివల్‌ జరిగే 23 రోజులలో 200ల దేశాల నుండి తీసుకోబడిన  రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు.  ఫైన్‌ డైనింగ్‌ నుండి హిడెన్‌ జెమ్‌ల వరకు, ఎమిరాటీ కాన్సెఫ్ట్‌ల నుండి అంతర్జాతీయ మిచ్లిన్‌ స్టార్‌ చేయబడిన రెస్టారెంట్‌ల వరకు డిఎఫ్‌ఎఫ్‌ 2024లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుబాటులో ఉంది. దుబాయ్‌ ఫెస్టివల్స్‌ అండ్‌ రిటైల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సీఈవో అహ్మద్‌ అల్‌ ఖాజా మాట్లాడుతూ  దుబాయ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ యొక్క 11వ ఎడిన్‌ అత్యుత్తమ ఆఫర్లను సరసమైన ధరలలో ప్రదర్శిస్తుంది, అదే సమయంలో నగరం యొక్క అత్యుత్తమ పాకశాస్త్ర ప్రతిభను గుర్తిస్తుంది. మేము గ్లోబల్‌ గాస్ట్రోనమిక్‌ డెస్టినేషన్‌గా దుబాయ్‌ ను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాము అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :