ASBL NSL Infratech

మాంసంపై 30 రోజులపాటు.. కరోనా!

మాంసంపై 30 రోజులపాటు.. కరోనా!

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ శీతలీకరించిన మాంసం, మత్స్య ఉత్పత్తుల్లో 30 రోజుల పాటు మనుగడ సాగిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఫ్రిజ్‌లో 4 డిగ్రీల సెల్సియస్‌ వద్ద చల్లబరచిన, ఫ్రీజర్‌లో మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ వద్ద శీతలీకరించిన మాంసాహార ఉత్పత్తులను ఇందులో పరిశీలించారు. పేగులు, ఊపిరితిత్తుల్లో ఈ వైరస్‌ తన సంఖ్యను పెంచుకునే వీలుండటం వల్ల ఇది చాలా ముఖ్యమైన పరిశోధన అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆగ్నేసియాలో ఈ విధానం ద్వారా కొవిడ్‌ వ్యాప్తి చెందుతుండొచ్చని చెప్పారు. కరోనా  తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉత్పత్తయిన ప్యాకేజ్డ్‌ మాంసాన్ని ఉపయోగించడమే ఇందుకు కారణమని అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :