ASBL NSL Infratech

శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యల కలకలం...

శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యల కలకలం...

వారసత్వ పన్ను ప్రకటనపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్య... సార్వత్రిక ఎన్నికల వేళ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో భాగంగా శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ..సంపద పున:పంపిణీకి సంబంధించిన అమెరికాలోని ఓ పద్దతిని ఉదహరించారు. యూఎస్‌లో వారసత్వపు పన్ను ఉంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ఆస్తిలోని 55శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మిగిలిన 45 శాతాన్ని వారసులకు తిరిగి పంపిణీ చేస్తారు. ఇది ఒక ఆసక్తి కరమైన చట్టం. ఇది నాకు ఎంతో న్యాయంగా అనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఈ వ్యవస్థలేదని.. దీని గురించి ప్రజలు ఆలోచించాలని తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేయాలను కుంటుందని ఆరోపించింది. ప్రజల ఆస్థులు, హక్కులు హరించాలని కాంగ్రెస్‌కు ప్రమాదకరమైన ఉద్దేశాలు ఉన్నాయని, పిట్రోడా వ్యాఖ్యలతో ఇవి బయటకు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అంబికాపూర్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్‌ నాయకుడు శ్యామ్‌ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ వారి నుంచి వారసత్వపు పన్ను ఆలోచన బయటకు వచ్చిందని అన్నారు. రాహుల్‌ గాంధీ సలహాదారే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారని అన్నారు. మీరు బతికిఉన్నంత వరకూ పన్నులతో వేధించే కాంగ్రెస్‌, మీ జీవితం ముగిసిన తరువాత కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. వారసత్వ పన్ను విధించి మీ ఆస్థులను, మీ పిల్లల హక్కులను లాక్కోవాలనుకుంటుంది అని మోడీ అన్నారు.

దీనిపై శ్యామ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని తెలిపారు. దేశంలోని ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రమే ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని ప్రచారం చేస్తున్న అబద్దాల నుంచి దృష్టి మళ్లించడానికి యూఎస్‌లో వారసత్వ హక్కును ఉదహరించానని, దీనిని మోడీ మీడియా వక్రీకరించడం దురదృష్టకరమని ఎక్స్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ శామ్ పిట్రోడా ఆలోచనను తమపై ఎందుకు రద్దుతున్నారంటూ బీజేపీ నేతలను ఖర్గే ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇదంతా ఎన్నికల్లో విజయం సాధించడం కోసం బీజేపీ చేస్తున్న కుయుక్తులని ఆయన అభివర్ణించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో మరో సీనియర్ నేత జై రాం రమేష్ సైతం స్పందించారు.

పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధమే లేదన్నారు.నేత జైరాం రమేశ్ స్పందించారు. శ్యామ్ వ్యాఖ్యలు తన వ్యక్తి గత అభిప్రాయాలని, దానితో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిజానికి పిట్రోడా చెప్పింది అమెరికాలో ధనవంతులైన కుటుంబాల గురించి ప్రస్తావించారు. వారి పెద్ద చనిపోయినప్పుడు, ఆసందర్భంగా అక్కడి ప్రభుత్వం వారి ఆస్తిలో 55శాతం తీసుకుని.. మిగిలింది ఆ కుటుంబవారసులకు పంపిణీ చేస్తుంది. ఇండియాలోని ఆస్తిపరులు, వ్యాపార వర్గాలు.. ఇలాంటి పంధా అవలంభించాలన్నది పిట్రో సూచన. అయితే దీన్ని సాదారణ పౌరులు, రైతులకు కూడా వర్తింపచేస్తూ ఎన్నికల ప్రచారంలో వాడేస్తున్నారు బీజేపీ నేతలు. సాక్షాత్తూ పీఎం స్థాయి వ్యక్తి కూడా ఇలా స్పందించడం దారుణమంటున్నారు కాంగ్రెస్ నేతలు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :