ASBL NSL Infratech

వైఎస్సార్ అసలైన వారసులెవరు..?

వైఎస్సార్ అసలైన వారసులెవరు..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఎన్నెన్నో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలు, నేతల ప్రచారాలు సరికొత్త అంశాలను తెరపైకి తెస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మద్య వైరం వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర వేభాదాలకు కారణమవుతోంది. ఇప్పుడు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు వారసులెవరు.. అనే ప్రశ్న ఆయన కుటుంబసభ్యులే వేసుకుంటున్నారు. దీంతో ఎలా ఉండే ఫ్యామిలీ ఎలా అయింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్, షర్మిల మధ్య వార్ ఇప్పుడు పీక్ కు చేరిందని చెప్పొచ్చు. మున్ముందు ఈ వార్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు జగన్. ఆ తర్వాత ఆయనపై కేసులు నమోదు కావడంతో జైలుకెళ్లారు. అప్పుడు పార్టీ బాధ్యతలను షర్మిల, విజయమ్మ మోశారు. అనేక పరిణామాల అనంతరం 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో జగన్ కు, షర్మిలకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆస్తిపంపకాలు, అధికారం కోసమే వాళ్ల మధ్య గ్యాప్ వచ్చిందని సమాచారం. దీంతో షర్మిల తెలంగాణకు వచ్చేసి పార్టీ పెట్టుకున్నారు. దాన్ని ఇటీవల కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి అక్కడికి మకాం మార్చేశారు. అప్పటి నుంచి జగన్ కు, షర్మిలకు మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది.

షర్మిలను ఎంపీగా చూడాలని వైఎస్ వివేకా అనుకున్నట్టు తెలుస్తోంది. అయితే దాన్ని అంగీకరించని జగన్.. అవినాశ్.. భారతి.. వివేకాను హత్య చేశారనేది ఆరోపణ. ఇప్పుడు ఇదే విషయాన్ని షర్మిల, సునీత పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. కుటుంబసభ్యులే చిన్నాన్నను హత్య చేశారని.. ఇంతకుమించిన ద్రోహం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. సొంత చెల్లెళ్లనే ఇంట్లోంచి బయటకు గెంటేసిన జగన్ ఇక మిగిలిన వాళ్లకు ఏం న్యాయం చేస్తారని డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు.

షర్మిలపై జగన్ కూడా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మరింత అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీళ్లా వైఎస్సార్ వారసులు అని ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ కంటే షర్మిల అంటేనే వైఎస్ కు ఎక్కువ అభిమానం అని.. ఒకవేళ వైఎస్ బతికుంటే షర్మిలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందుకే విజయమ్మ కూడా షర్మిలతోనే ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి వైఎస్ ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూగా మారిపోయింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :