ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మహారాష్ట్ర పైనే బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎందుకు ఫోకస్ పెడుతున్నారు?

మహారాష్ట్ర పైనే బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎందుకు ఫోకస్ పెడుతున్నారు?

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దేశవ్యాప్తంగా సత్తా చాటాలని గట్టిగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా బిజెపిని గద్దె దించాలని ఆయన పట్టుదల. అందుకోసమే ఆయన టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి రంగంలోకి దిగుతున్నారు. బిజెపి ఇతర పార్టీలన్నిటిని ఏకం చేసి కమలం పార్టీని దించేయాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో పాగా వేయడం కష్టమని భావించిన కెసిఆర్ చిన్నాచితక పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముందుకు వెళ్లాలని భావించారు. అయితే మహారాష్ట్రలో మాత్రం కెసిఆర్ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఏకంగా బీఆర్ఎస్ నే పూర్తిస్థాయిలో విస్తరించేలా స్కెచ్ వేశారు.

మహారాష్ట్రలో బిజెపి, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- ఎన్సిపి, శివసేన ప్రధాన పార్టీలు గా ఉన్నాయి. ఏదైనా రెండు పార్టీలు కలిస్తేనే ప్రతిసారి అధికారం చేరువవుతోంది. కాంగ్రెస్, ఎన్సిపి ముందు నుంచి కలిసి పని చేసేవి. అలాగే బిజెపి, శివసేన గుర్తుపెట్టుకునేవి. అయితే గత ఎన్నికల్లో ఇది రివర్స్ అయ్యింది. దీనివల్ల అన్ని పార్టీల్లో కేడర్ కాస్త చిన్నాభిన్నమైంది. పార్టీల్లోని అంతర్గత విభేదాలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వల్ల సర్దుబాట్లు, తదితర కారణాలు ఆయా పార్టీల్లో అసంతృప్తులకు కారణమవుతున్నాయి. చాలామంది నేతలు ఏదైనా మంచి వేదిక కోసం చూస్తున్నారు. సొంతంగా సత్తా చాటాలని భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో పొరుగునే ఉన్న కెసిఆర్.. జాతీయ పార్టీగా అవతరించాలనుకోవడం మహారాష్ట్ర నేతలకు బాగా కలిసి వచ్చింది. పైగా తెలంగాణతో మహారాష్ట్ర సరిహద్దును పంచుకోవడం, రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు.. ప్రజల మధ్య సత్సంబంధాలు ఉండడం కూడా నేతలు కెసిఆర్ పార్టీలో చేరడానికి కారణమవుతున్నాయి. అంతేకాక ఆర్థికంగా అన్ని తాను చూసుకుంటానని భరోసా మహారాష్ట్ర నేతలకు గట్టి ధైర్యాన్నిస్తుంది. అందుకే శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్, బిజెపి.. ఇలా అన్ని పార్టీల నేతలు కెసిఆర్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రైతు సంఘం నాయకులు బీఆర్ఎస్ లో చేరిపోయారు. త్వరలో మరి కొంతమంది నేతలు కూడా చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు కెసిఆర్. ఈనెల 24న మరో సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి నాందేడ్ పరిధిలో కాకుండా ఔరంగాబాద్ ను ఎంచుకున్నారు. ఇక్కడ మిత్రపక్షమైన ఎంఐఎంకు మంచి పట్టు ఉంది. ఔరంగాబాద్ లో కూడా పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరతారని అంచనా వేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో సానుకూల సంకేతాలు కనిపిస్తుండడంతో పార్టీని స్పీడుగా విస్తరించాలని కెసిఆర్ భావిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :