ASBL NSL Infratech

షటౌడౌన్ పరిష్కారానికి డెమొక్రాట్లు ఓకే

షటౌడౌన్ పరిష్కారానికి డెమొక్రాట్లు ఓకే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్న మెక్సికో గోడకు 500 కోట్ల డాలర్ల విడుదలకు ససేమిరా అన్న డెమొక్రాట్లు గత పది రోజులుగా కొనసాగుతున్న షట్‌డౌన్‌కు తెర దించేందుకు కొత్త ప్రదిపాదనలను ముందుకు తెచ్చారు. అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికైన నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనుండడంతో అమెరికన్‌ ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు, సెనేట్‌లో రిపబ్లికన్ల పట్టు సాధిస్తారు. ట్రంప్‌ మెక్సికో గోడ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపినా, సెనేట్‌ దీనికి అమోదించేందుకు సిద్దంగా లేకపోవడంతో షట్‌డౌన్‌కు పరిస్థితి దారి తీసింది. సెనేట్‌లో సమీకరణలు మారాక రిపబ్లికన్లకు మెజారిటీ లభిస్తుంది కాబట్టి ఇదే ప్లాన్‌ను వారు అమోదిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది వేచి చూడాలి. ట్రంప్‌ ప్రతిపాదనను రిపబ్లికన్లలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రవేశించాక కూడా షౌట్‌డౌన్‌ కొనసాగుతుండడంతో లక్షలాది మంది ఫెడరల్‌ ఉద్యోగులు జీతాలందక నానా అవస్థలు పడుతున్నారు. షట్‌డౌన్‌కు స్వస్తి చెప్పాలన్న వారి రోదన అరణ్య రోదనే అవుతుంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :