ASBL NSL Infratech

న్యూజెర్సీ లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

న్యూజెర్సీ లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రవాస తెలంగాణ, ఆంధ్ర సాహితీవేత్తలను, కవులను, మరియు సంగీత, నృత్య, జానపద కళాకారులను ఆహ్వానం పలకడంలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభల ప్రవాస సమన్వయ కర్త శ్రీ మహేష్ బిగాల గారు, ముఖ్య అతిధిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని, న్యూజెర్సీలో, రాయల్ ఆల్బర్ట్ పాలస్ లో సన్నాహక సదస్సు, కిక్కిరిసిన తెలుగు భాష ప్రేమికుల మధ్య ఘనంగా జరిగింది. మన తెలంగాణ సీఎం శ్రీ చంద్ర శేఖర్ రావు గారు మొట్ట మొదటి సారిగా తలపెట్టిన ఈ తెలుగు సభలను విజయవంతం చెయ్యడానికి ప్రవాస తెలుగు అభిమానులు తరలి రావాలని. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీనందిని సిద్దరెడ్డి, మరియు ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యులు ఈ సభల విజయవంతానికి చేస్తున్న కృషి మరువలేనిది అని, సభలకు తరలి వచ్చి తెలుగును విశ్వా వ్యాప్తం చేసే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.

ఈ సదస్సును ప్రపంచ తెలుగు మహాసభల న్యూజెర్సీ ఆహ్వాన కమిటీ సభ్యులైన శ్రీనివాస్ గనగోని, రవి ధన్నపునేని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు వారాంతం కావడంతో భారీ సంఖ్యలో తెలుగు అభిమానులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఆటా (ATA), తానా (TANA), నాటా (NATA), నాట్స్ (NATS), టీడీఫ్ (TDF), తేన (TENA), PTA, vision తెలంగాణ, GHHF, TFAS, NRVA, కళాభారతి, జాతీయ, రాష్ట్ర స్థాయి తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెరాస, OFBJP, మరియు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అందరు ప్రతినిధులు ఈ మహాసభలకు తమ మద్దతు తప్పకుండ ఉంటుందని చెప్పారు.

ఈ సదస్సులో ముందుగా అమెరికా, ఇండియా, జాతీయ మరియు తెలంగాణ రాష్ట్ర గీతాలతో ప్రారంభించి, అనంతరం నృత్యమాధవి డాన్స్ స్కూల్, శిష్యులు నృత్యం  ప్రదర్శించారు.

ఇప్పటి వరకు లండన్ (UK), అట్లాంటా (USA), టొరంటో (కెనడా), శాన్ఫ్రాన్సిస్కో (USA), మరియు డల్లాస్ (USA) నగరాల్లో జరిగిన అన్ని సదస్సుల్లో  పాల్గొన్న ప్రవాస తెలుగు అభిమానుల స్పందన, ఉత్తేజం చూసి తన ప్రయాణ బడలిక మరిచిపోయానని శ్రీ మహేష్ బిగాల తెలిపారు. నవంబర్ 23 ఆస్ట్రియా (వియన్నా) లో సన్నాహక సదస్సుకు మహేష్ బిగాల గారు సన్నద్ధులు అవుతున్నారు.

Click here for Event Gallery

 

Tags :