ASBL NSL Infratech

ముఖ్యమంత్రి రేవంత్‌తో టిటిఎ నాయకుల మీటింగ్‌...ఆహ్వానం

ముఖ్యమంత్రి రేవంత్‌తో టిటిఎ నాయకుల మీటింగ్‌...ఆహ్వానం

సియాటెల్‌లో జరగనున్న తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. హైదరాబాద్‌కు వచ్చిన టీటీఏ ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్‌ రీజనల్‌ అడ్వైజర్స్‌ డాక్టర్‌ ద్వారకానాథ రెడ్డి, నవీన్‌ గోలి, సీఈసీ ఈవీపీ డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రెడ్డి దొంతిరెడ్డితోపాటు ఈసీ, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, బీవోడీ దుర్గాప్రసాద్‌ సెలోజ్‌ తదితరులు రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మెగా కన్వెన్షన్‌ ఆహ్వానపత్రాన్ని ఆయనకు అందజేసి టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు టిటిఎ చేస్తున్న సేవా కార్యక్రమాలను, కన్వెన్షన్‌ వివరాలను ఆయనకు తెలియజేశారు.

 

Click here for Event Gallery

 

 

Tags :