ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఫ్లోరిడా తెలంగాణా అసోసియేషన్ దసరా బతుకమ్మ సంబరాలు

ఫ్లోరిడా తెలంగాణా అసోసియేషన్ దసరా బతుకమ్మ సంబరాలు

అయిగిరి నందిని నందిత మోదిని .... అని చేతులు జోడించి కోమలాంగులు పుష్పాలతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడినా ....
బ్రతుకమ్మ బ్రతుకమ్మ ఉయ్యాలో ... బంగారు బ్రతుకమ్మ ఉయ్యాలో ... అని చేయి చేయి కలిపి చప్పట్లు కొడుతూ పువ్వులకే పూజ చేస్తూ ఆడి పాడినా ....
బొమ్మలకొలువులు పెట్టి పప్పు బెల్లాలు పంచిపెట్టినా.. 
కుమారి పూజ చేసి పూలు, పళ్ళు పంచినా .....
ఈ దసరా నవరాత్రులకే చెల్లుతుంది. 
శరదృతువు మొదలవుతూనే పూబాలలు, భామమనులు పోటీపడుతూ కనువిందు చేస్తారు.

పండుగల్లోనే పెద్దపీట వేసుకుని 11 రోజులపాటు భధ్రపద అమావాస్య నుండి .. ఆశ్వయుజ దశమి వరకు  రంగురంగుల పూలతో, అలంకారాలతో, పట్టు పీతాంబరాలతో, ధగధగ మెరిసే నగలతో కనులకు, సొంపుగా, మనసుకు ఇంపుగా అలరారుతుంది ఈ దసరా పండుగ. 

ఇక తెలుగు రాష్త్రాలకు వస్తే బొమ్మల కొలువులు, కుమారి పూజలు, సిరిమాను, కుంకుమ పూజలు, ప్రపంచంలోని అన్ని దేశాలలో ప్రతేకతను సంతరించుకున్న మన బంగారు బతుకమ్మ.... ఈ పండుగ ప్రతేకతలు.

బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతంలో ఏంతో విశిష్టత ను సంతరించుకుంది. బతుకమ్మ అనగానే పువ్వుల్లాంటి కోమలాంగులు, కోమలాంగులకు మక్కువైన పువ్వులు స్పురణకు వస్తాయి....ప్రతి రోజు దేవుని పూజలో తరించే పూలకు ఈ తొమ్మిది రోజులు అతివలందరు కలిసి పూజ చేస్తారు.

ఇక బతుకమ్మ కథ కి వస్తే... ఆశ్వయుజ అమావాస్య  నాడు మొదలుకుని  అష్టమి వరకు ...చక్కగా గునుగు, తంగేడు, బంతి, సీతమ్మ జడకుచ్చు, చామంతి... మొదలగు పూలను సేకరించి...వరుసగ ఒకదానిపై ఒకటి వలయాకారంలో పేర్చి ...పైన గుమ్మడిపూవు,తమలపాకులో పసుపు గౌరి దేవిని వుంచి, పూజ చేసి, ఆనాట్ సాయంకాలం అందరు తమ తమ బతుకమ్మలతో...ఒక చోట చేరి...రకరకాల  పాటలతో బతుకమ్మ  చుట్తు తిరుగుతూ ఆడి, పాడుతారు... ఆ తరువాత కమ్మగా వండిన పదార్థాలను ప్రసాదంగా తీసుకుని సంబరాలు జరుపుకుంటారు...ఇలా తొమ్మిది రోజులు ఏంతో సంతోషంగ, ముచ్చటగా జరుపుకుని...తొమ్మిదోరోజు మరింత పెద్దబతుకమ్మను చేసి సంబరంగా ఆడి...బతుకమ్మను నిమజ్జనం చేసి సాగనంపుతారు.

చక్కగా వానలు కురిసి...పంటలు పండి...నిండిన చెరువులతోటి, చేతికందిన పంటలతోటి...జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ.. ఇంత ప్రఖ్యాతి చెందిన బతుకమ్మ సంబరాలను దక్షిన ఫ్లోరిడా లోని " తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా " ఆద్వర్యంలో అంబరాన్ని అంటేలా కనుల పందువగా, కమ్మని విందులతో కదుపు నిండుగా, ఆట పాటలతో, పోటీ మేళవింపులతో ఎంతో ఉత్సాహంగా కమిటీ రధ సారధి  శ్రీ మోహిత్ కర్పూరం గారు మరియు కార్యవర్గ బృంద నేతృత్వంలో జరుపుకున్నారు. 
ఎంగిలి పూల బతుకమ్మ నుందొ, సద్దుల బతుకమ్మవరకు రకరకాల పాటలతో , పాటలకణుగుణంగా చిందులతొ మహిళామణులంతా  మనోహరంగా పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా గౌరమ్మపూజ తో మొదలుపెట్టి .. బతుకమ్మ ఆటపాటలు, కోలాటాం, సాంప్రదాయ నృత్యాలు, చిన్నారుల ఆటపాటలు, సంగీత కచేరీలు, అల్లి బిల్లి ఆటలు... చెప్పుకుంతూ పోతే ఆనందాలను, సంతోషాలను రాశి పోసిన విధంగా తీర్చిదిద్ది "తెలంగాణ అసొసియేషన్ ఆఫ్ ఫ్లోరిడాను "  ఉన్నత స్తాయిలో నిలబెట్టిన ఘనత ప్రధాన కార్యదర్షి శ్రీ మోహిత్ కర్పూరం గారు మరియు కార్యవర్గ సభ్యులు పవన్ కొమ్మెర, నిరుపమ కాసం, శరత్ కొత్తకాపు, హరినాథ్ తాలంపల్లి, వంశీ కాలం, శ్రవన్ మొగుడంపల్లి , సునీల్ ఉప్పాలి, స్వప్నశ్రీ చిత్తూరి, అమర్ కోలెటి, రాహుల్ గండ్ల,  లక్ష్మణ్ గుడిపాటి, విజయ్ మసూరం.

ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి, రక్తి, ముక్తి మేళవింపులతో ఇంత బాగా జయప్రదం చేసిన " తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా సభ్యులు మరియు కార్యవర్గబృందం శ్రమ, దీక్ష శ్లాఘనీయం.

Click here for Event Gallery

 

Tags :