ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలుగు రాష్ట్రాల్లో 'తానా' చెస్ టోర్నీలు'

తెలుగు రాష్ట్రాల్లో 'తానా' చెస్ టోర్నీలు'

తెలంగాణ రాష్ట్రంలో చెస్‌ క్రీడను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాల, గురుకుల, సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మ్తొతం 31 జిల్లాల్లో జిల్లాల వారీగా చెస్‌ టోర్నమెంట్‌లను నిర్వహించిన అనంతరం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. టోర్నమెంట్‌ ప్రైజ్‌మనీ మొత్తం రూ.3.60 లక్షలు, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలో బాలబాలికల్లో మొదటి స్థానంలో నిలిచిన ఇద్దరికి చెరి రూ.10వేల చొప్పున, మిగతా ఎనిమిది మందికి చెరి వెయ్యి రూపాయల చొప్పున క్యాష్‌ అవార్డును అందజేస్తారు. జిల్లావ్యాప్తంగా టోర్నమెంట్‌ క్యాష్‌ ప్రైజ్‌ మొత్తం రూ.28వేలు.

రాష్ట్ర స్థాయిలో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచిన బాలబాలికలకు ట్రోఫీతో పాటు రూ.50వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.30వేలు నగదును బహూకరిస్తారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలో బాలబాలికల్లో మొదటి ఐదు స్థానాలు గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న పోటీలకు అర్హత పొందుతారు. దీంతో ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న పోటీలకు మొత్తం పది మంది బాలబాలికలు పాట్గొంటారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసగోగినేని, తెలంగాణ చెస్‌ సంఘం ప్రధాన కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావుతో కలిసి స్కాలర్‌షిప్‌ చెస్‌ టోర్నమెంట్‌ వివరాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న బాలబాలికలను చెస్‌ క్రీడలో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మొట్టమొదటి సారి స్కాలర్‌షిప్‌ ప్రైజ్‌మనీ చెస్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస తెలిపారు. రెండు రాష్ట్రల్లో రూ.15 లక్షల క్యాష్‌ ప్రైజ్‌ మనీ చెస్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని అన్నారు.

తానా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని వాటి అమలు కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న స్కాలర్‌షిప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో 8,9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే పోటీలో పాల్గొంటారని తెలిపారు. తాను కూడా చెస్‌ క్రీడాకారుడినేనని, చెస్‌ క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు తెలివి తేటలతో పాటు వారిలో అత్మస్థయిర్యం పెంపొందుతుందని అన్నారు. రెండు రాష్ట్రాల్లో నిర్వహించే  ఈ టోర్నమెంట్‌లో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.30వేలు క్యాష్‌ అవార్డును అందజేస్తామని పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫీకెట్‌ లతో పాటు అసక్తికరమైన బహుమతులను ఇస్తామని అన్నారు. చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహణ కోసం కృషి చేస్తున్న ఇరు రాష్ట్రాల చెస్‌ సంఘం ప్రతినిధులను గోగినేని అభినందించారు.

ఆంద్రప్రదేశ్‌లో ఈ నెల 18, 19, తెలంగాణలో ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం ప్రధాన కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా,  రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టోర్నమెంట్‌లను విజయవంతంగా నిర్వహిస్తామని, టోర్నమెంట్‌లో పాల్గొనే విద్యార్థులు ఉచిత ప్రవేశంతో పాటు భోజన, వసతి సదుపాయాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

Tags :