ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తానా బతుకమ్మ వేడుకలు...

తానా బతుకమ్మ వేడుకలు...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యూ ఇంగ్లాండ్‌ ప్రాంతీయ నాయకులు ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ పండుగ కనెక్టికట్‌లో 23న జరిగింది. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్లూరి, న్యూ ఇంగ్లాండ్‌ తానా ఆర్‌విపి విశ్వనాధ్‌ నాయునిపాటి మరియు వారి టీం ఆధ్వర్యంలో 650 మందికిపైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. వందలాది మహిళలు కోలాటం ఆడుతూ, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. న్యూ ఇంగ్లాండ్‌ ప్రాంతం లోని అన్ని రాష్ట్రాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.

ఈ సందర్భంగా జే తాళ్ళూరి తానా ఆధ్వర్యంలో కమ్యూనిటీకి చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.తానా 5కే..... ఇంకా తాను చేస్తున్న అనేక కార్యక్రమాలను వివరించారు  బతుకమ్మ పండుగని దేశ వ్యాప్తంగా జరిపేలా కృషి చేస్తామని చెప్పారు. విశ్వనాథ్‌ నాయునిపాటి మాట్లాడుతూ , ప్రాంతాలతో, మతాలతో, కులాలతో సంబంధం లేకుండా తెలుగు వారందరు కలిసి మెలిసి చేసుకొన్న ఒక అద్భుతమైన పండుగ ఇది అని, బంగారు బతుకమ్మలు ఇంటిలో పేర్చి తెచ్చిన .... బంగారు తల్లులు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి తెలుగు వారికీ సంస్కృతిని, నాగరికతని మరింత చేరువ చేస్తామని చెప్పారు. తానా తరపున బతుకమ్మ ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే ప్రధమం అని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను  వేల మందితో చేస్తామని చెప్పారు. ఈ కార్య క్రమానికి మద్దతు తెలిపిన తానా ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమనకు ఇతర తానా ఈసీ సభ్యులకు విశ్వనాధ్‌ నాయునిపాటి కృతజ్ఞతలు చెప్పారు. జయల తెలుకుంట్ల నరసింహ తెలుకుంట్ల గార్లు, శిరీష తునుగుంట్ల , రావు వోలేటి, సుమంత్‌ రామిసేట్టి, కృష్ణ శ్రీ గంధం, శైలజ చల్లపల్లి తమ సందేశాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరపడానికి శ్రీని వడ్లమూడి, రాం కోయ్యాడ,  విక్రాంత్‌ సూర్యదేవర, వెంకట్‌  చింతపల్లి, లక్ష్మి నారాయణ అనపర్తి షాహుల్‌, సతీష్‌ పలుకూరు, అశోక్‌ భానోత్‌, ఉదయ్‌, పృధ్వీ చేకూరి మరియు అనేక మంది కార్యకర్తలు విశేషంగా కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్‌ చేసిన భోగ్‌ రెస్టారెంట్‌, శ్రీకాంత్‌ దాసుగారి, మధు రెడ్డి, లక్ష్మి మోపర్తి, లక్ష్మి దేవినేని, జగదీష్‌ ప్రభలకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.

Click here for Event Gallery

 

Tags :