ASBL NSL Infratech

తానా 5కె వాక్ విజయవంతం...

తానా 5కె వాక్ విజయవంతం...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బోస్టన్‌లోని హోలిస్టన్‌ టౌన్‌లో 5కె వాక్‌ ను విజయవంతంగా నిర్వహించింది. గ్లోబల్‌ గ్రేస్‌ హెల్త్‌ తో కలిసి తానా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ వాక్‌ను నిర్వహించారు.

తానా నాయకుడు కె.పి. సోంపల్లి మాట్లాడుతూ, అమెరికాలో ఛారిటీ కార్యక్రమాల కోసం తానా దాదాపు 3-4 మిలియన్‌ డాలర్లకుపైగా ఖర్చు చేస్తోందని చెప్పారు. కమ్యూనిటీకి సేవ చేయాలన్న తలంపుతో తానా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ 5కె వాక్‌ ను నిర్వహించడం జరిగిందని, దీనికి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు మాట్లాడుతూ, మంచి కార్యక్రమాల నిర్వహణలో అందరూ భాగస్వాములవ్వాలన్న తలంపుతో ఇలాంటి కార్యక్రమాలను తానా ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు.

తానా ఫౌండేషన్‌ నాయకుడు శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ, ఫౌండేషన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

మురళీ పసుమర్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జాన్‌ ఆలూరు, కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి, శ్రీనివాస్‌ ఎండూరి, విజయలక్ష్మీ గంధం, శ్రీనివాస్‌ కంతేటి, రవి పుల్లూరు, రామకృష్ణ, అరుణ్‌ నాంపల్లి, గీత జమ్ముల, ఉమ నల్లూరి శిరీష, అపర్ణ పచ్చల, కాళి తిరువీధి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బ్రేక్‌ ఫాస్ట్‌ తో పాటు టీ షర్టులను ఉచితంగా అందించారు.

 

 

Tags :