ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం - దసరా దీపావళి ఉత్సవ విశేషాలు

బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం - దసరా దీపావళి ఉత్సవ విశేషాలు

28 అక్టొబర్ 2018 న Nashua High School South లో Telugu Association of Greater Boston (TAGB) దసరా దీపావళి వేడుకలకు 700 లకు పైగా సభ్యులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.

ఎప్పటి లాగే పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితం చేయటానికి TAGBకార్యవర్గ సభ్యులు ప్రేక్షకులకి ఎన్నో చక్కని ఆహ్లాదకరమైన కార్యక్రమాలను అందించి అలరించారు.కార్యక్రమ ప్రాంగణాన్నిTAGB శ్రీమతి రూబి బోయినపల్లి ఆధ్వర్యంలో అలంకరణ బృందం, సంప్రదాయ ఉత్సవ ఆకృతితో పాఠశాల ప్రవేశద్వారం మరియు వేదికను అలంకరించి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు.

నాటి వేడుకలు Board of Trustees సభ్యులు పద్మ పరకాల, సురేందర్ మాదాది గార్లు  జ్యోతి ప్రజ్వలన చేసిన పిదప అధ్యక్షురాలు శ్రీమతి మణిమాల చలుపాది స్వాగతం తో ప్రారంభమయ్యాయి.

చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక గానామృతములతో, భజనలు, డాన్సు మెడ్లీల సందడులతో , శాస్త్రీయ సంగీతము మరియు శాస్త్రీయ నృత్య ప్రదర్శనల తో, పాటు పెద్దలు ఉత్సాహంగా చేసిన  వినూత్న కార్యక్రమాలు ప్రేక్షకుల ప్రత్యేకప్రశంసలు అందుకున్నాయి. వేదికపై 'బతుకమ్మ' పండగ వేడుకలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుక మన సంస్కృతికి సంబరాల కి ప్రాతినిధ్యం గా నిలచి నాటి కార్యక్రమాలకి వన్నెతిచ్చింది. కూచిపూడి నాట్యాలయం విద్యార్థులు 'నారాయణతే నమో నమో' నృత్యం లో దశావతారాలు చూపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇవే కాక, వేదికపైననే సరదా 'సరదాగా కాసేపు' జరిపించిన వివాహ  వేడుకలు, బాలలహరి విద్యార్థుల' భక్తి గీతాలు', శ్రీరామ్ రేకపల్లి మరియు MVN కిరణ్ కుమార్ గార్ల మృదంగం, వయోలిన్ 'జుగల్బందీ', మరియు "జరిగింది చెప్తాను, జరిగేది చెప్తాను" అని వచ్చి, నేటి తరం Cell phone ల  వ్యసనంతో ఎటువంటి ముప్పుల్లో పడుతున్నారో విడమర్చి చెప్పిన 'సోది'  లాంటి కార్యక్రమాలు ప్రేక్షకుల బహు మెప్పును పొందాయి.

మానస కృష్ణ నేపథ్యంలో ప్రదర్శించిన 'నవదుర్గా నర్తనం - మహిషాసుర మర్దనం' నృత్యము ప్రేక్షకులని భక్తి సామ్రాజ్యంలో ఓలలాడించి, మొత్తం దసరా కార్యక్రమానికే కలికితురాయిలా నిలిచింది. కల్చరల్ సెక్రటరీ  శ్రీమతి పద్మజా బాలా పర్యవేక్షణలో కల్చరల్ టీమ్ రెండు నెలలకు పైగా కష్టపడి మనకీ  కార్యక్రమాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి  శ్రీ అరుణ్ మూల్పూర్ మరియు సుధా  మూల్పూర్ గార్లు  వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తమ చక్కని తెలుగు వాక్చాతుర్యంతో, వచ్చిన ప్రేక్షకుల మనస్సులు దోచుకున్నారు.

6 గంటల పాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో 40 కి పైగా ప్రదర్శనలతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు. కార్య వర్గ సభ్యులు శ్రీ సీతారాం అమరవాది, శ్రీ రమణ దుగ్గరాజు, శ్రీ రామకృష్ణ పెనుమర్తి మరియు శ్రీమతి సత్య పరకాల కార్యక్రమాన్నిపర్యవేక్షించారు. కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి అంటే వాటి వెనుక ఎందరోచిన్నారులు, వారి తల్లి తండ్రులు మరియు గురువులు, అలాగే ఎందరో స్వచ్ఛందసేవకులు మరియు TAGB కమిటీ సభ్యుల ఎన్నో గంటల నిర్విరామ పరిశ్రమ ఫలితమే. TAGB కి, ప్రాంతీయ తెలుగు సంస్థలకు కూడా అందించిన విశేష విశిష్ట సేవలకు, హరిత బృందం (GREEN Team) నిర్వాహకులు శ్రీమతి మాధవికమ్మ మరియు శ్రీ చందశెఖర్ కమ్మ లను టి.ఏ.జి.బి సత్కరించింది. Board of Trustees వారిని సత్కరించారు. వైస్ చైర్మన్ శివ దోగిపర్తి గారు B.O.T సభ్యుల తరఫున అందరికి పండగ శుభాకాంక్షలుతెలియజేసారు.

TEAM Aid స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున శ్రీ. నన్నపనేని మోహన్ గారు, పలు మానసిక, శారీరక కష్టాలకు గురి అయిన తెలుగు వారికి, అంటే రోడ్ ప్రమాదాలకు, రకరకాల మహమ్మారి వ్యాధులకు గురి అయి, దిక్కు తోచని, తోటి తెలుగు వారికి, వారి కుటుంబాలకి తమ సంస్థ ద్వారా ఎటువంటి మంచి సేవలు సహాయాలు  అందిస్తున్నారో TAGB ప్రేక్షకులకు తెలియచేసారు.

నాటి సాయంత్రము ప్రదర్శనలతో పాటు ఆవరణ లో పెట్టిన అంగడులు కూడావచ్చినవారిని ఆకట్టుకున్నాయి. ఆ నాటి సాయంత్రము గోదావరి రెస్టారెంటు వారు విచ్చేసిన ఆహుతులకు చక్కని రుచికరమైన భోజనం అందించారు.

చివరిగా ఎంతో కృషిని, సమయాన్ని వెచ్చించి నాటి వేడుకలను విజయవంతంచేసిన ప్రదర్సకులకు, వారి తల్లితండ్రులకు, విచ్చేసిన ప్రేక్షకులకు, వాలంటీర్లకు , TAGB కార్యవర్గ సభ్యులకు , మరియు దాతలకు  సెక్రటరీ రమణ దుగ్గరాజు ధన్యవాదాలు తెలియజేసారు. భారత జాతీయ గీతం పాడటంతోనాటి వేడుకలు విజయవంతంగా ముగిసాయి. నాటి కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్ లు శ్రీ వెంకట్ గణేష్ ఆన్లైన్ ట్రేడింగ్ అకాడమీ.

Click here for Event Gallery

 

Tags :