ASBL NSL Infratech

నాటా కన్వెన్షన్‌లో సాక్షి ప్రతినిధిని సత్కరించిన శంకర నేత్రాలయ బృందం

నాటా కన్వెన్షన్‌లో సాక్షి ప్రతినిధిని సత్కరించిన శంకర నేత్రాలయ బృందం

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కంటి వైద్యశాల శంకర్ నేత్రాలయ. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా)తో కలిసి ఈ వైద్యశాల ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది. వీటన్నింటికీ ఎంతో ప్రచారం కల్పించిన సాక్షి వార్తా సంస్థ అమెరికా ప్రతినిధి సింహబలుడు హనుమంతుడును శంకర్ నేత్రాలయ సత్కరించింది. నాటా 2023 తెలుగు మహాసభల సందర్భంగా ఆయన్ను సత్కరించడం గమనార్హం. నాటా తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనే సింహాను శంకర్ నేత్రాలయ ప్రతినిధులు సత్కరించారు. డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి చేతుల మీదుగా సింహాకు అవార్డు కూడా అందించారు. సింహాతోపాటు మరికొంతమందికి శంకర్ నేత్రాలయ అవార్డులను అందించింది. ప్రజలకు తమ ఆస్పత్రి చేపడుతున్న కార్యక్రమాలు చేరువయ్యేందుకు ఎంతో కృషి చేసినందుకు సింహాకు శంకర్ నేత్రాలయ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ఏటా ఎన్నో సేవాకార్యక్రమాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ తన సహకారం అందిస్తున్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డితోపాటు మద్దతుగా నిలిచిన అందరికీ ఈ సందర్భంగా టీం ధన్యవాదాలు తెలిపింది.

 

 

Tags :