ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

భారత్‍, అమెరికా సంబంధాల్లో కొత్త చరిత్ర : మోదీ

భారత్‍, అమెరికా సంబంధాల్లో కొత్త చరిత్ర  : మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ భారత్‍కు ప్రత్యేక మిత్రుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‍, అమెరికా సహజ భాగస్వాములని చెప్పారు. ట్రంప్‍ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‍లో నూతనంగా నిర్మించిన మోతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‍ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. నూతన దశాబ్దం మొదలైన వేళ, అధ్యక్షుడు ట్రంప్‍ లాంటి ప్రత్యేక నాయకుడు, ప్రత్యేక మిత్రుడు భారత పర్యటనకు రావడం గొప్ప సందర్భమని పేర్కొన్నారు. పునరుత్తేజం పొందిన అమెరికాకు నవభారత్‍ అనే నూతన అవకాశాలను కల్పిస్తున్నదని చెప్పారు.

భారత్‍, అమెరికా చారిత్రక సంబంధాల్లో ట్రంప్‍ పర్యటన సరికొత్త అధ్యయమని అభివర్ణించారు. రెండు దేశాల మధ్య బంధం కేవలం భాగస్వామ్యం మాత్రేమ కాదని, అంతకంటే గొప్ప, సుదృఢమైన సంబంధం అని వ్యాఖ్యానించారు. సరికొత్త చరిత్ర ఆరంభమవుతున్నదని, కొత్త కూటములు, సవాళ్లు అవకాశాలు, మార్పులకు పునాది పడుతున్నదన్నారు. 21వ శతాబ్దంలో ప్రపంచ రూపురే•లను నిర్ణయించడంలో భారత్‍, అమెరికా మధ్య సంబంధాలు సహకారం కీలకం కానున్నదని చెప్పారు. భారత్‍కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, భారత సైన్యం అమెరికాలో కలిసి భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.

Click here for Photogallery

 

Tags :