ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ సంబరాలు

కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ సంబరాలు

ప్రపంచములో ఏ ప్రాంతంలోనైనా సరే దేవుడిని పూజించాలన్నా ప్రార్థించాలన్నా.. పూలతో కొలుస్తారు.. కానీ ఆ పూలనే భగవంతుడి రూపంగ అమ్మవారి ప్రతిరూపంగా బతుకమ్మ గా కొలువడమనేది ఒక్క తెలంగాణ సంస్కృతికే సొంతం అక్టోబెర్ 13 తారీకు(శనివారం) సాయంత్రం 3:30 నిమిషాలకు కాన్సాస్ నగర ఓవర్లాండ్ పార్క్ లో బతుకమ్మ లేక్ వుడ్ పాఠశాల హాల్ దీప కాంతుల వెలుగుల్లో ఆడపడుచులందరు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలూ ఆడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు.

గునిగిపూల సోయగాలు.. తంగేడు రెపరెపలు.. ఉప్పుపూల పులకరింతలు.. మందార మకరందాలు.. బంతి సింగారాలతో ముస్తాబై.. బతుకమ్మగా పూదొంతరల శిఖరాగ్రాన కాగితాలతో తయారు చేసిన 8 ఫీట్ల విగ్నేశ్వరుడు, శివుని విగ్రహాల మధ్య కాకతీయ కాళా తోరణం కింద కొలువుదీరిన గౌరమ్మ, మధ్యాహ్నం 3:30 లలితా సహస్ర నామ పూజతో కార్యక్రమం ప్రారంభమయింది. 

రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవిని ఘనంగా పూజించారు. బతుకమ్మ సంబరాలను ఆటాపాటాలతోఅంగరంగ వైభవంగా నిర్వహించారు. రేలా రే రేలా ఫేం సుపరిచిత జానపద గాయకురాలు షాలిని ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాములాయే సందమామ.. అంటూ ఎన్నెనో జానపదాల హోరు.. బతుకమ్మ సంస్కృతి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలంతా కోలాటాలు, సంప్రదాయ బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు. మరపు రాని గాన మాధుర్యం తో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేశారు.

చేనేత కార్మికుల దుస్తుల ప్రదర్శన, సంవత్సరపు కార్యవర్గ ఆహ్వానం, జాబ్ ఫెయిర్ వెండొర్స్ స్టాల్ల్స్ జరిగినాయి. ఈ ఉత్సవాల్లో పిల్లలు పెద్దలు అంతా అందంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్క్రుతిని తెలిపేలా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. తమ సంస్కృతి మరియు సంప్రదాయాన్ని మరచిపోలేదని నిరూపించారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంపైనా పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.  

సుపరిచిత జానపద గాయకురాలు షాలిని  పాడటం ఆడటం మరియు పురుషులను కూడా, స్త్రీలని ప్రోత్సహించడానికి పిలిపించారు. ఈ కార్యక్రమం ముగిసే సరికి శక్తి మరియు అభిరుచితో మహిళలు బతుకమ్మ ఆట పాటలతో కొనసాగించి బాలికలు పాల్గొనడం కాకుండా వారి పాత్ర ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణ.

పూజ అనంతరము భక్తులందరికీ పూజలో కంకణాలను బట్టి జమ్మి ఆకు మరియు ఆక్షింతలు ఇచ్చారు. అన్ని కుటుంబాలు జమ్మీని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిధుల నుండి దీనెనను తీసుకున్నారు.

బతుకమ్మ సాగనంపే కార్యక్రమాన్ని ప్రత్యక్ష సాంప్రదాయ తెలంగాణ సంగీత వాయిద్యం తో ఊరేగింపుగా తీసుకెళ్ళి కొలనులో నిమజ్జనం చేశారు. హైస్కూల్  పిల్లవాడు అభినవ్ డ్రోన్ లో కెమెరా & ఫ్లాష్ లైట్ పెట్టి దారి చూపిస్తూ ఫోటోలు తీసాడు. మృష్టాన్న భోజనాలతో సభ రాత్రి 10 కి పండుగ ముగిసింది. 

దినేష్ చిన్నలచ్చయ్య, కిరణ్ కానకదండిల గార్లు ఈ 12వ బతుకమ్మ ఉత్సవాన్ని కాన్సస్ చరిత్రలోనే అతిపెద్ద బతుకమ్మ పండుగగా దిగ్విజయంగా జరిగినందుకు సభికులకు ధన్యవాదాలు తెలిపారు. 

కన్సాస్ సిటి తెలంగాన కల్చరల్ అసొసియెషన్ కార్యవర్గ సబ్యులు కిరన్ కనకడండిల, దినెష్ చినలచైయగారి, వెంకట పుసులూరి, గౌరి చెరుకుమూడి, శ్రిదెవి గొబ్బురి, బిందు చీదెళ్ళ, మహతి మండ, విజయ్ కొండి, సరిత మద్దూరు, వెంకట్ మండ, శ్రీనివాస్ తలగడదీవి తదితరులు మరియు మిత్రులు, వాలంటీర్స్ సహాయము తొ కార్యక్రమము విజయవంతముగా జరుపబడింది. స్పాన్సర్లు ఈ కార్యక్రమము కి వెన్నుముక లాగ నిలిచారు.

Click here for Event Gallery

 

Tags :