ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బోస్టన్ లో ఘనంగా విజయదశమి వేడుకలు

బోస్టన్ లో ఘనంగా విజయదశమి వేడుకలు

బోస్టన్‌లోని తెలుగువాళ్ళు విజయదశమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో ఈ దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు దాదాపు 250 మంది విదేశాంధ్రులు హాజరయ్యారు.  జమ్మిపూజతో వేడుకలను సంప్రదాయంగా ప్రారంభించారు. ఆటపాటలు, సాంస్క తిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆహ్లాదభరితంగా జరిగాయి. పసందైన విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఆటా సభ్యులైన రమేష్‌ నలవోలు, మల్లా రెడ్డి యనల, క్రిష్ణా ద్యాపా, సోమశేఖర్‌ నల్లా, చంద్ర మంచికంటి, శశికాంత్‌, దామోదర్‌, రవి, మధు, అనిత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

 

Tags :