ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీఆర్ఎస్ లోకి సబిత ఇంద్రారెడ్డి ?

టీఆర్ఎస్ లోకి సబిత ఇంద్రారెడ్డి ?

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్‌, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన తనయుడైన కార్తీక్‌ రెడ్డితో కలిసి మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితలతో చర్చలు జరిపారు. చర్చలు ఫలప్రదం కాగా  పార్టీలో చేరేందుకు సబిత ఇంద్రారెడ్డి అంగీకరించినట్లు  తెలిసింది. సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వారం రోజుల క్రితం వారు ఎంపీ అసదుద్దీన్‌తో ఈ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా ఆదివారం మరోసారి అసద్‌ ఇంటికి చెరుకున్నారు. కొద్దిసేపటికే కేటీఆర్‌ అక్కడికి వచ్చి చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై తుది తఫా చర్చలు జరిగాయి.    

సబిత ఇంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటు చేవెళ్ల ఎంపీ స్థానం కార్తీక్‌రెడ్డికి ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది. టీఆర్‌ఎస్‌ తరపున మరో అభ్యర్థి పేరు ప్రచారంలోకి వస్తున్నందున ఈ అంశం మీద కూడా ఈ సందర్భంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. చివరికీ ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారని సమాచారం. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌లు కొండపూర్‌లోని ఎంపీ కవిత నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఇదే అంశంపై చర్చించారు. సీఎం కేసీఆర్‌కు తాను తెలియజేస్తానని కవిత వారికి చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో సీఎంతో భేటీ కావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

 

Tags :