ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీఆర్ ఎస్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలి : చంద్రబాబు

టీఆర్ ఎస్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలి : చంద్రబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కోదాడలో ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  కేసీఆర్‌ పచ్చి అవకాశవాది అని ధ్వజమెత్తారు. కోదాడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి డిపాజిట్‌ రాదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 11 తర్వాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్‌.. మాజీ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు వెళ్లలేదని దుయ్యబట్టారు. దేశాన్ని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో కలిశానని అన్నారు.

ప్రధాని మోదీ, కేసీఆర్‌ నియంతల్లా తయారయ్యారని దుయ్యబట్టారు. అర్థరాత్రి ఇంటి తలుపులు పగలగొట్టి రేవంత్‌ను అరెస్ట్‌ చేశారు. రేవంత్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికం. ఓడిపోయే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మురిగిపోతుంది. టీడీపీ లేకుంటే కేసీఆర్‌ రాజకీయ భవిష్యత్తే లేదు. అహంకారంతో మాట్లాడే వ్యక్తులను ఇంటికి పంపాలి. మోదీతో కేసీఆర్‌ లాలూచీపడ్డారు. నియంతలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు. పగలు ఎంఐఎంతో, రాత్రి బీజేపీతో కేసీఆర్‌ స్నేహం. ఎంఐఎం, కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టే. కేసీఆర్‌ సభలకు ప్రజలు రావడం లేదు. టీఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు కావాలి. డబుల్‌బ్రెడూం ఇళ్లు ఎవరికైనా వచ్చాయా? ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామన్నారు ఇచ్చారా? దళితుడిని సీఎం చేస్తానంటే నేను అడ్డుపడ్డానా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డానా? మహిళలకు మంత్రిపదవి ఇస్తానంటే అవడ్డుపడ్డానా? పాలనను తిరిగి గాడిలో పెట్టే సామర్థ్యం ప్రజాకూటమికే ఉంది అని సృష్టం చేశారు.

 

Tags :