ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

11 దేశాల్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

11 దేశాల్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలను తూర్పుయూరప్‌లోని 11 దేశాల్లో ఘనంగా నిర్వహించారు. డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, పోలాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల్లో కేక్‌కట్‌చేసి జన్మదిన వేడుకలు జరిపినట్టు టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం మీడియాకు తెలిపారు. 
ఐర్లాండ్‌తోపాటు, పలు దేశాల్లోని తెలంగాణవాదులు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు, హోమాలు చేశారని చెప్పారు. విదేశాల్లో, తెలంగాణలో ఎన్నారైశాఖల కోఆర్డినేటర్లు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు. టీఆర్‌ఎస్ డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్‌బాబు ఆకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రసాద్‌రావు కల్వకుంట్ల, ఐరెడ్డి సందీప్‌రెడ్డి, గడ్డంవార్ మహేందర్‌శర్మ, వైవీ శ్రీనివాస్, మేడిపల్లి వివేక్‌రెడ్డి, శ్రీధర్ గండే, మహేందర్ బొజ్జ, అరవింద్‌బాబు, వినయ్‌బండారి, ఫణిరామ్, నీలాస్ శ్రీనివాస్, మూర్తికర్ర, కపిల్ మగ్గిడి పాల్గొన్నారు.

Tags :