ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సియాటెల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సియాటెల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అమెరికాలోని సియాటెల్‌ నగరంలో ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శని, ఆదివారాల్లో ఇంటర్‌ లేక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవాల్లో స్థానికంగా ఉన్న వాషింగ్టన్‌ తెలుగు సమితి, వాషింగ్టన్‌ తెలంగాణ అసోసియెషన్‌, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్‌ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ నివసించే వివిధ రాష్ట్రా ప్రజలు, శ్వేత జాతియులు పాల్గొన్నారు. సుమారు 2500 మంది పాల్గొనగా నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. బతుకమ్మ ఆటా, పాటల తోపాటు కోలాట దృశ్యాలు హైలైట్‌గా నిలిచాయి.

ముఖ్య అతిథులుగా వసుంధర స్లాటర్‌ (అమెరికన్‌ పొలిటిక్‌ లీడర్‌, డెమొక్రటిక్‌ పార్టీ) తెలుగు హీరోయిన్‌లు రశ్మి, లయ వచ్చిన ప్రజలను ఉత్సాహపరుస్తు బతుకమ్మ ఆడి పాడారు. 6 అడుగుల పెద్ద బతుకమ్మ ఈ సారి ఒక ప్రత్యేకత అవి ముఖ్య అతిథులు నిర్వాహకులను ప్రశంసించారు. ఇండియా నుండి వచ్చిన జానపద కళాకారుడు బిక్షునాయక్‌, స్థానిక కళాకారులు చైతన్య శిల్పాలు వచ్చిన వారికి డప్పు దరువులతో మంచి మంచి పాటలతో ఆహ్వానం పలికారు.

వాటా ప్రెసిడెంట్‌ హరి కట్కురి, వాట్స్‌ ప్రెసిడెంట్‌ రాం కొలెటి, వాట్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ వంశి రెడ్డి, ఇతరులు ఎప్పటికప్పుడు వాలంటీర్స్‌ ను సమన్వయం చేస్తూ ఈ సంబరాల్ని ఘనంగా నిర్వహించినందుకు వసుందర స్టాలర్‌ ప్రత్యేకంగా వారిని అభినందించారని స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధి జలగం సుధీర్‌ తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :