ASBL NSL Infratech

డిసెంబర్ 10 నుంచి 30 వరకు ఆటా వేడుకలు

డిసెంబర్ 10 నుంచి 30 వరకు ఆటా వేడుకలు

అమెరికా తెలుగు సంఘం ప్రతి రెండేళ్ళకోమారు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఆటా వేడుకలు ఈ సంవత్సరం డిసెంబర్‌ 10 నుంచి 30వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆటా ద్వారా వివిధ సేవా సహాయ కార్యక్రమాలు, సెమినార్‌లు, సాహిత్య సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆటా ప్రెసిడెంట్‌ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జయంత్‌ చల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. వచ్చే సంవత్సరం జూలైలో ఆటా మహాసభలు అట్లాంటాలో జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల ద్వారా ఆటా మహాసభలకు రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను, తెలుగు ప్రజలను ఆహ్వానించనున్నారు.

డిసెంబర్‌ 10వ తేదీన హైదరాబాద్‌లో ఆటా వేడుకలపై విలేఖరులతో ఇష్టాగోష్టి సమావేశం జరుగుతుంది. అదేరోజున శ్రీశైలంలో ట్రైబల్‌ ఏరియాలో ఉన్న స్కూల్స్‌లో సహాయ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జయంత్‌ చల్లా, శివశంకర్‌ రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 12వ తేదీన మేడ్చల్‌ జిల్లాలోని బాచుపల్లిలో ఉన్న స్కూల్‌లో కార్యక్రమాలు, స్కాలర్‌ షిప్‌లను ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 14వ తేదీన బాన్స్‌వాడ ఆసుపత్రిలో హెల్త్‌ కేర్‌పై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సతీష్‌ రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరించనున్నారు. డిసెంబర్‌ 15న బాసరలోని ఐఐఐటీలో విద్యాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా ఆటాతోపాటు వెంకటరమణ (టిజిహెచ్‌ఇసి) వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 16న వనపర్తిలో ఎడ్యుకేషన సెమినార్‌ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆటా బిఓటీ రామకృష్ణారెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 17న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో సాహిత్య సమావేశంను ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 19న వైజాగ్‌లో బిజినెస్‌ సెమినార్‌ను నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 21న హైదరాబాద్‌లోని టి హబ్‌లో బిజినెస్‌ ఇండస్ట్రీ సెమినార్‌ ను సిఐఐ సహకారంతో ఏర్పాటు చేశారు. ఆటా సిఐఐ కలిసి ఈ సెమినార్‌ను నిర్వహిస్తున్నాయి. డిసెంబర్‌ 22న వరంగల్‌లో వివిధ కార్యక్రమాలను కూడా ఈ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. శ్రీధర్‌ కంచనకుంట దీనిని స్పాన్సర్‌ చేశారు.

డిసెంబర్‌ 24న తిరుపతిలో ఎడ్యుకేషనల్‌, కల్చరల్‌, అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 25న హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌లో హెల్త్‌ సెమినార్‌ జరుగుతుంది. డా. శ్రీని గంగసాని, ఆపి, డా గురు రెడ్డి ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా ఉన్నారు. డిసెంబర్‌ 26న హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో ఆటా గోల్ప్‌ డే ను ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 27న గజ్వేల్‌లో మెగా హెల్త్‌ క్యాంప్‌ ను నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ యాదవరెడ్డి ఎమ్మెల్సీ దీనిని స్పాన్సర్‌ చేశారు. డిసెంబర్‌ 28న విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భానుస్వర్గం, కె.వి. సత్యనారాయణ దీనికి స్పాన్సర్‌గా ఉన్నారు. డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో స్కూల్‌ పిల్లలకు స్కాలర్‌ షిప్‌ల ప్రదాన కార్యక్రమం జరుగుతుంది. జయంత్‌ చల్లా దీనిని స్పాన్సర్‌ చేశారు. డిసెంబర్‌ 30న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సెంట్రల్‌ కోర్డ్‌ లో గ్రాండ్‌ ఫైనల్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆటా నాయకులంతా తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు.

వేడుకలకు అందరూ రండి...మధు బొమ్మినేని

తెలుగు రాష్ట్రాల్లో ఆటా నిర్వహిస్తున్న వేడుకలకు అందరూ రావాలని ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని కోరారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆటా సేవలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా ఆటా నాయకుల సహకారంతో విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు, పేదలకు వైద్య సహాయం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రవీంద్ర భారతిలో గ్రాండ్‌ ఫైనల్‌ పేరుతో పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వివిధ కార్యక్రమాలతో అలరించనున్న వేడుకలు : జయంత్‌ చల్లా

ఆటా వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకోసం సెమినార్‌లు, బిజినెస్‌ ప్రముఖులతో మరో సెమినార్‌ను ఏర్పాటు చేశామని, అలాగే సాహిత్యరంగంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాహితీ ప్రముఖులను ఒకే వేదికపై తీసుకువచ్చి వారిద్వారా వివిధ అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జయంత్‌ చల్లా వివరించారు. హైదరాబాద్‌లోని ర వీంద్రభారతిలో, సెంట్రల్‌ కోర్ట్‌లో ఫైనల్‌ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని జయంత్‌ చల్లా పేర్కొన్నారు.

ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు 2023

డిసెంబర్‌ 17వ తేదీన ఆటా వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ఏర్పాటు చేశారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కొలకలూరి ఇనాక్‌, ముఖ్య అతిధిగా నందిని సిధారెడ్డి హాజరవుతున్నారు. వేణు నక్షత్రం ఆహ్వానం పలుకుతారు. ఆటా మాట పేరుతో మధు బొమ్మినేని మాట్లాడుతారు. సాహిత్య వేడుకలు పేరుతో జయంత్‌ చల్లా, ఆటా సాహిత్య సేవలు పేరుతో రాజేశ్వరరావు టేక్మాల్‌ మాట్లాడనున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియారంగం అంశంపై కాసుల ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శాంతి స్వరూప్‌, శ్రీమతి ఐనంపూడి లక్ష్మీ, జె. శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్వామి ముద్దం, జెఎల్‌ నరసింహారెడ్డి, నలిమెల భాస్కర్‌, చెంచనాల శ్రీనివాస్‌, శ్రీమతి కొలకలూరి మధుజ్యోతి, నరాల రామిరెడ్డి, శ్రీమతి కొండపల్లి నీహారిణి తదితరులు హాజరవుతున్నారు.

టేకులపల్లి గోపాల్‌ రెడ్డి, మధురాంతకం నరేంద్ర, మధుబాబు, పెద్దింటి అశోక్‌ కుమార్‌, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, మహ్మద్‌ గౌస్‌, హుమయూన్‌ సంఫీుర్‌, పత్తిపాక మోహన్‌, ఎస్‌.వి. సత్యనారాయణ, మువ్వా శ్రీనివాసరావు, నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, శ్రీమతి మందరపు హైమవతి, శ్రీమతి కొఞడపల్లి నీహారిణి, కందకూరి శ్రీరాములు, జల్లేపల్లి బ్రహ్మం, కవి యాకూబ్‌, వెల్డండి శ్రీధర్‌, రవీందర్‌ మనుకూరి, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, దేశపతి శ్రీనివాస్‌, పెంచలదాస్‌ తదితరులు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమానికి జి. కిషన్‌ రావు అధ్యక్షత వహిస్తే, ముఖ్య అతిథులుగా జూలూరి గౌరీ శంకర్‌, శ్రీమతి మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిధిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ హాజరుకానున్నారు. తప్పెట రామ ప్రసాద్‌ రెడ్డి, బలగం వేణు, అల్లాణి శ్రీధర్‌, మామిడి హరికృష్ణ, షరీఫ్‌ మహ్మద్‌ కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఆటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ ఆటా వేడుకలు చైర్‌ జయంత్‌ చల్లా, కో చైర్‌ వేణు సంకినేని, లిటరరీ కమిటీ చైర్‌ వేణు నక్షత్రం ఆధ్వర్యంలో జరగనున్నాయి.

 

 

Tags :