ASBL NSL Infratech

పదో రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

పదో రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్న జననేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పదో రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చింతకుంట, దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.

మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం కొండాపురంలో పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ బస చేస్తారు. కాగా, తొమ్మిదవ రోజు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ 14.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు ఆయన 124.3 కిలోమీటర్లు పాదయాత్ర  చేశారు.

కర్నూలు జిల్లా--పెద్దచింతకుంట చేరుకున్న శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర. ..

శ్రీ వైయస్ జగన్ ను కలిసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలసదన్ విద్యార్ధినులు..
స్కూల్ కు నడిచి వెళ్లాల్సి వస్తుందని శ్రీ జగన్ వద్ద విద్యార్ధుల ఆవేదన..
తక్షణమే రవాణా సౌకర్యం కల్పించాలని పార్టీ నేతలకు శ్రీ జగన్ ఆదేశం..
బాలసదన్ లో మినరల్  వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని సూచన..

Click here for Photo Gallery

Tags :