ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డల్లాస్‌లో వేటా మహిళా దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న కార్యక్రమాలు

డల్లాస్‌లో వేటా మహిళా దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న కార్యక్రమాలు

ప్రాంతాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతమైన లాభాపేక్షలేని ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌  ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్‌ మహానగరము ‘‘ఫ్రిస్కో’’ లోని ఇండిపెండెన్స్‌ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఫ్రిస్కో సిటీ కౌన్సిల్‌ పోటెం మేయర్‌ ‘‘జోన్‌ కీటింగ్‌’’ కీలకోపన్యాసం చేశారు. అతిథి వక్తలు అవార్డు గెలుచుకున్న టెక్‌ లీడర్‌ ‘‘ఏమీ జుచ్లెవ్స్కీ’’ మరియు అంబికా దద్వాల్‌, ప్రొడక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రస్తుత సందర్భంలో మరియు సమాజంలో మహిళల పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు.

ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సమాజ సేవకు గాను ‘‘సురోమా సిన్హా’’ మరియు ‘‘మెర్సీ స్ట్రిక్‌ల్యాండ్‌’’లకు ఆదర్శప్రాయమైన సేవా పురస్కారాలు బహుకరించారు. అందించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వీణ యలమంచిలి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అందరిని సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ తెలుగు ప్లేబాక్‌ సింగర్‌ సుమంగళి, శ్రీకాంత్‌ లంక పాటలతో ప్రేక్షకులలో హుషారు నింపి హోరెత్తించారు. ‘‘తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే మహిళా సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్‌ ఎంపవర్‌ మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (వేటా)’ అనే సంస్థను 2019లో ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ సంస్థ ముఖ్య లక్ష్యాలు స్త్రీలకు సరైన నైపుణ్యాలను అందించడం, సాధికారత, శక్తినివ్వడం మరియు జ్ఞానోదయం చేయడం, తద్వారా వారు సమాజానికి సానుకూల సహకారం అందించడం. మహిళా నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తుంది. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్‌ చేసినందుకు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారు లోకల్ WETA డల్లాస్ టీం నవ్య స్మృతి రెడ్డి Secretary, BOD ప్రతిమ రెడ్డి, వాలంటీర్లు: గాయత్రి గిరి, మాధవి, ప్రశాంతి, జ్యోస్త్న, రేఖ లకు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. రత్నమాల వంక -BOD, సునీత గంప -సోషల్ మీడియా చైర్, కమ్యూనిటీ ఔట్రీచ్, విశ్వా వేమిరెడ్డి -BOD కూడా పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :