ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

స్వీట్ అండ్ షార్ట్ గా టిల్లూ స్వ్కేర్ ర‌న్ టైమ్

స్వీట్ అండ్ షార్ట్ గా టిల్లూ స్వ్కేర్ ర‌న్ టైమ్

టిల్లూ స్వ్కేర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్ప‌టికే ఆన్ లైన్ లో స్టార్ట్ అయిపోయాయి. మెయిన్ సెంట‌ర్స్ లో ఇప్ప‌టికే మంచి జోరు క‌నిపిస్తుంది. సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ ఇప్ప‌టికే ఈ సినిమా కోసం రెండేళ్ల‌కు పైగా టైమ్ ను ఖ‌ర్చు పెట్టాడు. డీజే టిల్లూకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డైరెక్ట‌ర్ కాకుండా ఈ సినిమాకు మ‌రో డైరెక్ట‌ర్ ఆ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. మ‌ల్లిక్ రామ్ త‌న బాధ్య‌త‌ను ఏ మేర‌కు నిర్వ‌ర్తించాడ‌నేది ఈ శుక్ర‌వారంతో తేలనుంది.

కూల్ గా ప్ర‌మోష‌న్స్ ను నిర్వ‌హిస్తున్నారు టిల్లూ స్వ్కేర్ మేక‌ర్స్. ఇప్ప‌టికే ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ర‌న్ టైమ్ కేవ‌లం 1 గంట 58 నిమిషాల‌కు ఫైన‌ల్ చేశార‌ని సెన్సార్ టాక్. అంటే సినిమా నిడివి రెండు గంట‌లలోపే అన్న మాట‌. కంటెంట్ బాగుంటే మూడు గంట‌ల సినిమా కూడా చూస్తున్న ఈ రోజుల్లో టిల్లూ స్క్వేర్ ను ఇంత త‌క్కువ నిడివికి ఫిక్స్ చేయ‌డం విశేష‌మే.

దీని వ‌ల్ల ఎగ్జిబిట‌ర్లు ఎక్స్‌ట్రా షోలు వేసుకోవ‌డ‌మే కాకుండా వేరే సినిమాల‌కు కూడా కేటాయించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. పాజిటివ్ టాక్ వ‌స్తే టిల్లూ స్వ్కేర్ కు క‌నీసం రెండు వారాలైనా తిరుగుండ‌దు. త‌ర్వాత వారం ఫ్యామిలీ స్టార్ రిలీజైనా ఆ సినిమాకు ఫ్యామిలీ ఆడియ‌న్సే ఎక్కువ మొగ్గు చూపుతారు. స్పెష‌ల్ ప్యాకేజ్ గా అనుప‌మ గ్లామ‌ర్ షో ఎట్రాక్ష‌న్ కానుంది. ఇన్ని పాజిటివ్ అంశాల మ‌ధ్య రిలీజ‌వుతున్న టిల్లూ స్వ్కేర్ ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :