ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కళలను, సేవలను ప్రోత్సహిస్తున్న టిఎల్‌సిఎ 

కళలను, సేవలను ప్రోత్సహిస్తున్న టిఎల్‌సిఎ 

53 ఏళ్లుగా తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) తెలుగు భాషా సంస్కృతుల్ని, వారసత్వాన్ని సంరక్షించడమే కాకుండా, తెలుగు సంస్కృతిలోని ప్రత్యేకతను, గొప్పదనాన్ని తన కార్యక్రమాల ద్వారా  ప్రపంచానికి చాటి చెబుతోంది. కళాకారులను ప్రోత్సహించడం లో టిఎల్‌సిఎ ఎల్లప్పుడూ ముందుంటుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు, భాష, కళలు, ఇతర నైపుణ్యాలను ప్రదర్శించుకునేందుకు వేదికగా టిఎల్‌సిఎ ఏర్పాటైంది. అసోసియేషన్‌ ప్రారంభమైనప్పటి నుండి సంక్రాంతి, ఉగాది, దీపావళి వంటి పండుగలను వైభవంగా జరపడంతోపాటు, కమ్యూనిటీకి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను కూడా టిఎల్‌సిఎ నిర్వహిస్తోంది.

వార్షిక పిక్నిక్‌. క్రికెట్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటి ఆటలను, వక్తృత్వం, వ్యాస రచన, కళ, క్లాసికల్‌/సెమీ క్లాసికల్‌/ వంటి పోటీలను కూడా నిర్వహిస్తోంది. దీంతోపాటు యువత, పురుషులు మరియు మహిళల కోసం ప్రత్యేక పోటీలను, కార్యక్రమాలను కూడా చేస్తోంది.  జానపద నృత్యం, క్లాసికల్‌/సెమీ క్లాసికల్‌/జానపద పాటలు, యోగా/ఆరోగ్యం/ఆర్థిక/పోషకాహారం/ఇమ్మిగ్రేషన్‌ సెమినార్లు ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలతో టిఎల్‌సిఎ అందరినీ అలరిస్తోంది.  సినిమా కళాకారులు, సంగీతకారులు, గాయకులు, విద్వాంసులు, ఆధ్యాత్మిక గురువులు, నృత్య గురువులు మరియు నృత్య కళాకారులతోపాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను తన వేడుకలకు, కార్యక్రమాలకు ఆహ్వానించి వారి ప్రతిభను టిఎల్‌సిఎ కుటుంబానికి పరిచయం చేస్తోంది. టిఎల్‌సిఎ ప్రెసిడెంట్‌ కిరణ్‌ పర్వతాల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. 

తెలుగు సంఘాలకు మాతృసంస్థలా, అతి ప్రాచీనమైన తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన టిఎల్‌సిఎ ఇప్పుడు భవిష్యత్‌ తరాలకు కూడా తెలుగు సంప్రదాయ వారసత్వాన్ని అందించే కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తోంది. టిఎల్‌సిఎ వినూత్నమైన కార్యక్రమాలతోపాటు తీర్థయాత్ర పేరుతో అమెరికాలోని ముఖ్యమైన ఆలయ సందర్శన కార్యక్రమం మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఎంతోమంది పెద్దలు టిఎల్‌సిఎ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మకు ప్రేమతో వంటి కార్యక్రమాలతోపాటు ఆటల పోటీలు, పిక్నిక్‌లు టిఎల్‌సిఎ ప్రత్యేకతను చాటాయి. భవిష్యత్తులో కూడా ఆకట్టుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తాము.

Best wishes to Telugu Times

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :