ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌)

ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌)

4 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం ప్రవాస భారత తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చిరునామాగా పేరుగాంచింది. జాతీయ తెలుగు సంఘాలతో పోటీపడేలా టాంటెక్స్‌ కార్యక్రమాలు కనిపిస్తుంటాయి. 

తెలుగు భాషా, సంస్కృతులకు, స్థానిక తెలుగు సమాజానికి సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే టాంటెక్స్‌ అందించే కార్యక్రమాలు తెలుగు భాషాభిమాని మెచ్చేలా ఉంటుంది. టాంటెక్స్‌ నిర్వహించే ఉగాది, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద వేడుకలు తెలుగు భాషాభిమానులను రంజింపజేసేవిగా ఉంటాయి. అలాగే తెలుగు సాహిత్యాభిమానులకోసం టాంటెక్స్‌ సాహిత్యవేదిక నిర్వహించే నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం అయితే ప్రపంచంలోని తెలుగు సాహిత్యాభిమానులను ఆకట్టుకునేలా ఉంటుంది. టాంటెక్స్‌ రేడియో గానసుధ ద్వారా ఎంతోమందితో పరిచయ కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉంటాయి. సీనియర్‌ సిటిజెన్స్‌కోసం, అమెరికాకు వచ్చిన తల్లితండ్రులకోసం కూడా మైత్రీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను టాంటెక్స్‌ చేస్తున్నది. ప్రస్తుతం టాంటెక్స్‌ అధ్యక్షునిగా సతీష్‌ బండారు వ్యవహరిస్తున్నారు. ఆయన హయాంలో టాంటెక్స్‌ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.

దాదాపు 4 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం కార్యక్రమాలతో కొత్త ఒరవడిని సృష్టించింది. టాంటెక్స్‌ సాహిత్యవేదిక నిర్వహించే నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ద్వారా తెలుగు సాహిత్యా నికి ఎనలేని సేవలు అందించినవారిని గుర్తించి వారికి వేదిక ద్వారా సన్మానించడం, వారి సాహిత్య వైభవాన్ని అందరికీ తెలియజేస్తోంది. టాంటెక్స్‌ రేడియో గానసుధ ద్వారా ఎంతోమందితో పరిచయ కార్యక్రమాలు చేస్తున్నాము. తెలుగు కమ్యూనిటికీ పత్రిక, పోర్టల్‌, యూట్యూబ్‌ ద్వారా మీడియా సేవలు అందిస్తున్న తెలుగుటైమ్స్‌కు వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :