ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఫోన్ ట్యాపింగ్ రొచ్చులో బీఆర్ఎస్..!!

ఫోన్ ట్యాపింగ్ రొచ్చులో బీఆర్ఎస్..!!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఎక్కడో మొదలైన ఈ వ్యవహారం పెద్దల పునాదులు కదిలేదాకా వెళ్తోంది. తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవంత్ సర్కార్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంతు చూసే వరకూ నిద్రపోయేలా లేదు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పలువురు పెద్దలు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నారనే ఆరోపణలు రావడంతో వాళ్లంతా ఇప్పుడు వణికిపోతున్నారు.

గత పదేళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండేది. ముఖ్యంగా గత ఐదేళ్లలో ప్రతిపక్ష నేతలు, సెలబ్రిటీలు, మీడియా అధిపతులు, ప్రముఖ వ్యాపార వేత్తల ఫోన్లను కేసీఆర్ సర్కార్ ట్యాప్ చేయించిందనే విషయం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ బయటపెట్టింది. కేసీఆర్ సర్కార్ లో కీలక అధికారిగా ఉన్న ప్రణీత్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూసేవారని నిర్ధారణకు వచ్చింది. అతణ్ణి అరెస్టు చేయడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వస్తుందని భావించిన ప్రణీత్ రావు.. అప్పుడు వాడిన సామాగ్రిని, సర్వర్లను డ్యామేజ్ చేశారు. కొన్నింటిని అడవుల్లోకి తీసుకెళ్లి పడేశారు. వాటన్నిటినీ సేకరించి డేటా క్రోఢీకరించే పనిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. ఆ ట్యాపింగ్ వ్యవహారం ఎలా జరిగింది.. ఎవరెవరివి ట్యాప్ చేశారు.. లాంటి విషయాలను ఆరా తీస్తున్నారు. ఇందులో విస్తుగొలిపే అనేక అంశాలున్నాయి. రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇందులో ఉండడం ఆశ్చర్యం కలిగించింది.

కేవలం ట్యాపింగ్ వరకూ ఈ వ్యవహారం ఆగలేదు. ట్యాపింగ్ లో దొరికిన అంశాలను బట్టి కొందరిని ప్రణీత్ రావు అండ్ కో బెదిరించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. పై అధికారులు చెప్పడం వల్లే మేం చేశాం అని ప్రణీత్ రావు సహా ఇతరులు చెప్తున్నారు. ప్రభాకర్ రావు మాత్రం చేయాల్సిందంతా చేసి ఇప్పుడు అమెరికాలో దాక్కున్నారు. ఆయనే ట్యాపింగ్ కు ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది.

అయితే అధికారుల వెనుక అప్పటి ప్రభుత్వంలోని పలువురు పెద్దలు ఉన్నట్టు దర్యాప్తు బృందం తేల్చింది. త్వరలోనే వాళ్లకు కూడా నోటీసులు వెళ్లి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. కొందరిని అరెస్టు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం అలాంటిదేమీ లేదని ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చారు. ఇప్పుడు కేటీఆర్ మాత్రం ఒకరివో ఇద్దరివో ట్యాపింగ్ చేసి ఉండొచ్చు పోలీసోళ్లు.. అని ముక్తాయించారు. దీన్ని బట్టి ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ అంగీకరించారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మొత్తానికి ట్యాపింగ్ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :