ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీిపాడ్‌)

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీిపాడ్‌)

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ను తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, తెలంగాణ కళలను, పండుగలను నేటి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారు. సారూప్య వారసత్వం ఉన్న వ్యక్తులు ఒకరికొకరు మరియు ఉత్తర టెక్సాస్‌లో వారి విలువలను పంచుకోవడానికి ఒక వేదిక ఉండాలన్న ఉద్దేశ్యంతో అలాగే తెలంగాణ రాష్ట్ర వాసులకు, కమ్యూనిటీకి సహాయం అందించాలన్న లక్ష్యంతో కూడా టిపాడ్‌ ఏర్పాటైంది. సాంస్కృతికంగా సుసంపన్నమైన తెలంగాణ గుర్తింపును కాపాడుకోండి. క్లాసిక్‌ మరియు ప్రాచీన తెలుగు భాషను సంరక్షించడం, తదుపరి తరాలకు దానిని ప్రచారం చేయడం, తెలంగాణా పండుగలను అందరితో కలిసి పెద్దఎత్తున నిర్వహించడం వంటి వాటితో టిపాడ్‌ ఇప్పటికే మంచి గుర్తింపును సంపాదించుకుంది.

తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను పెద్దఎత్తున నిర్వహించడంతోపాటు బతుకమ్మ వేడుకను రికార్డులు సృష్టించేలా చేయడంలో టిపాడ్‌ మంచి పేరు తెచ్చుకుంది. టిపాడ్‌ నిర్వహించిన సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఫ్రిస్కో పట్టణ పరిధిలోని కొమెరికా సెంటర్‌లో వైభవంగా జరిగిన ఈ వేడుకలకు సుమారు 12వేల మంది హాజరైనట్లు టిపాడ్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. బతుకమ్మ వేడుకలను నిర్వహించడంలో తనకు తానే సాటి అని టిపాడ్‌ నిరూపించుకుంది. అలాగే టిపాడ్‌ నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో రక్తదానం ఒకటి. కార్టర్‌ బ్లడ్‌ కేర్‌ వంటి సంస్థలతో కలిసి ఫ్రిస్కో, టిఎక్స్‌లో బ్లడ్‌ డ్రైవ్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తూ ఎంతోమందికి రక్తదానం చేస్తోంది.  ఇతర వివిధ ఈవెంట్‌లలో, స్థానిక ఫుడ్‌ బ్యాంక్‌లో ఫుడ్‌ డ్రైవ్‌ను నిర్వహించడంలో కూడా టిపాడ్‌ సభ్యులు సహాయాన్ని అందజేస్తున్నారు.

సభ్యులకోసం కమ్యూనిటీకోసం వనభోజనాలను కూడా టిపాడ్‌ పెద్దఎత్తున చేస్తోంది. ప్రస్తుతం టిపాడ్‌కు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌గా రూప కన్నయగారి ఉన్నారు. 
బతుకమ్మ వేడుకను రికార్డులు సృష్టించేలా చేయడంలో టిపాడ్‌ మంచి పేరు తెచ్చుకుంది. సంస్కృతీ సంప్రదాయా లను ప్రచారం చేయడం, కమ్యూనిటీ కోసం అవస రమైన కార్యక్రమా లను చేయడం ద్వారా టీపాడ్‌ విస్తరిస్తోంది. బ్లడ్‌ డ్రైవ్‌లో చాలా మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. సమాజ సేవా కార్యకమాలను మరింతగా చేయాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నాము. తెలుగు కమ్యూనిటికీ పత్రిక, పోర్టల్‌, యూట్యూబ్‌ ద్వారా మీడియా సేవలు అందిస్తున్న తెలుగు టైమ్స్‌కు 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :