ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆకట్టుకున్న టిఎజిసి మహిళాదినోత్సవ వేడుకలు

ఆకట్టుకున్న టిఎజిసి మహిళాదినోత్సవ వేడుకలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో (టీఏజీసీ), ఉత్తర అమెరికాలోని మొట్టమొదటి తెలుగు సంఘం, మార్చి 9, 2024న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మ్యాగజైన్‌ కవర్‌ పేజీ థీమ్‌ ఈవెంట్‌తో అద్బుతమైన వేడుకలను నిర్వహించింది. గ్లామ్‌ గాలా యొక్క మరుపురాని సాయంత్రం కోసం చికాగో లాండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 600 మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో టీఏజీసీ ప్రెసిడెంట్‌ శ్రీ సంతోష్‌ కొండూరి, శ్రీమతి. లావణ్య కొండూరి, మహిళా దినోత్సవ చైర్‌ శ్రీమతి. ప్రసన్న కందుకూరి, మరిఉ కో చైర్స్‌ శ్రీమతి. స్వల్న లింగాల, శ్రీమతి, నిషిగంధ గీబు, మరియు శ్రీమతి. తులసి వేముల పాల్గొన్నారు. ఇతర ప్రముఖ టీఏజీఏ మహిళా డైరెక్టర్ల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌లు శ్రీమతి. అర్చన పొద్దుటూరి, శ్రీమతి, మాధవి రాణి కొనకళ్ల, శ్రీమతి. నీలిమ చెకిచర్ల, శ్రీమతి, శిరీషమద్దూరి, శ్రీమతి, శ్వేత చిన్నారి, మరియు శ్రీమతి. వినీత పొద్దుటూరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంసీ వీణా యెలమంచలి ఉల్లాసంగా ఈ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. హాజరైన వారు ఉల్లాసకరమైన గేమ్‌లు, మనోహరమైన సభ్యుల బహుమతులు మరియు ఉత్కంఠభరితమైన బంగారు నాణేల రాఫెల్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రతి ఒక్కరికి, అద్బుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని మరియు మరుపురాణి జ్ఞాపకాలను నింపుకునే అవకాశాన్ని ఈ ఈవెంట్‌ ఇచ్చింది.  మహిళలు ఉత్సాహంగా పాల్గొని, రిథమ్‌ ఇన్ప్యూజ్‌ చేసిన రీల్స్‌ పోటీలను ఆస్వాదించారు. అధునాతన  పాటలు, క్లిష్టమైన హుక్‌ స్టెప్పులు మరియు డైలాగ్‌లతో వ్యక్తీకరణ నవరస భావోద్వేగాలను కలిగి ఉన్న స్పాట్‌ పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక చిరస్మరణీయ అనుభవంగా మారింది. 

మహిళలు సగర్వంగా స్ట్రైడ్‌ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ ఫ్యాషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్యాషన్‌ మాత్రమే కాకుండా వారి బలం, ఐక్యత మరియు విభిన్న ప్రతిభను కూడా ప్రదర్శించారు. విశిష్ట అతిథి వక్త, డాక్టర్‌ రాధిక చిమట, మహిళలకు మానసిక ఆరోగ్య అవగాహన, మరియు శ్రేయస్సుకు మార్గం అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. పోలీసాఫీసర్‌ సోబాన్స్కీ, ఆత్మరక్షణ వ్యూహాలను మరియు క్లిష్ట సమయాల్లో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియజేశారు. మహిళల ఇష్టానికి అనుగుణంగా 15కి పైగా వెండర్‌ బూత్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఒక సంతోషకరమైన షాపింగ్‌ అనుభావన్ని అందించింది టీఏజీసీ. చాక్లెట్‌ ఫౌంటేన్‌, లైవ్‌ సమోసా మరియు భేల్‌ పూరీ స్టేషన్లు అతిథులను మరింత ఆహ్లాదపరిచాయి. మంచి విందు భోజనం మరియు డెసర్ట్‌ తో డిన్నర్‌ ముగిసింది. ఈ మరుపురాని అనుభూతిని సాధ్యం చేసినందుకు మా ఇన్‌ క్రెడిబుల్‌ ఫుడ్‌ కమిటీ శ్రీ శ్రీనివాస్‌ నాగిరెడ్డి మరియు  చందు కూరపాటి మరియు క్యాటరర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ వెంకట గునుగంటి, శ్రీపరమ యరసాని, శ్రీరమణ కల్వ, శ్రీశ్రీధర్‌ అలవల, శ్రీ సృజన్‌ న్కెనాప్పగారి, శ్రీ లక్ష్మీ నారాయణ తోటకూర, శ్రీ వేణు చెరుకూరి, శ్రీ శశి చవా మరియు శ్రీ రమాకాంత్‌ జొన్నల ఈ వేడుకల విజయవంతానికి సహాయ సహకారాలు అందించారు మరియు ఈవెంట్‌ సజావుగా సాగేలా చూశారు. 

సమాజానికి తిరిగి ఇచ్చే మా చిరకాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, హైదరాబాద్‌లో అనాథ బాలికలకు ఆశ్రయం ఇస్తున్న  వైదేహి సేవా సమితికి ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. 1993లో స్థాపించబడిన ఈ ఆశ్రమం ఈ బాలికలకు సంరక్షణ, విద్య మరియు ఉపాధితో సహా వారి భవిష్యత్తు ప్రయత్నాలకు మార్గదర్శకత్వం అందిస్తున్నది.  

రీగల్‌ జ్యువెలర్స్‌, తనిష్‌, అందాల్‌ జ్యువెలర్స్‌, అవిగ్నా జ్యువెలరీ మరియు పీఎం కన్సల్టింగ్‌తో సహా మా స్పాన్సర్‌ల ఉదార సహకారంతో ఈవెంట్‌ విజయవంతమైంది. రీగల్‌ జ్యువెలర్స్‌, తనిష్‌ మరియు అందాజ్‌ జ్యువెలర్స్‌ రాఫిల్‌ టికెట్‌ల కోసం బంగారు నాణెం/ నగల సర్టిఫికేట్‌లను స్పాన్సర్‌ చేసి, ఈవెంట్‌కు ఉత్సాహం మరియు ప్రతిష్టను జోడించాయి. అదనంగా, అవిగ్నా జ్యువెలరీ యొక్క 360 ఫోటో బూత్‌ స్పాన్సర్‌షిప్‌ హాజరైన వారికి చిరస్మరణీయమైన పీఎం కన్సల్టింగ్‌ యజమాన్ని కళ్యాణి జొన్నవితులకు కూడా టిఎజిసి తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.   

ఫోటోగ్రాఫర్‌ సదీష్‌  మరియు అతని ప్రతిభావంతులైన బృందం ప్రధాన వేదిక మరియు వివిధ ఫోటో బూత్‌లలో మంత్రముగ్దులను చేసే క్షణాలను నైపుణ్యంగా చిత్రీకరించారు.  

మహిళా దినోత్సవ వేడుకలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు  పల్స్‌ పౌండిరగ్‌ డ్యాన్స్‌ పార్టీలో వాతావరణం ఉల్లాసంగా పెరిగింది. డీజే సందీప్‌ యొక్క డైనమిక్‌ బీట్‌లు మరింత ఆకర్షించాయి.  

టీఏజీసీ అధ్యక్షుడు శ్రీ సంతోష్‌ కొండూరి, మహిళా దినోత్సవ చైర్‌ శ్రీమతి ప్రసన్నకందుకూరి తమ కమ్యూనిటీల్లోని సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడానికి మరియు మహిళలకు సాధికారత కల్పించడానికి తమ ప్రయత్లాను కొనసాగించడానికి ఈ కార్యక్రమం ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు.

కార్యనిర్వాహక కమిటీ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు, స్పాన్సర్లు మరియు వాలంటీర్లకు వారు ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. 

 

Click here for Event Gallery

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :