ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1,200 డాలర్లు ఇస్తేనే .. లేదంటే

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1,200 డాలర్లు ఇస్తేనే .. లేదంటే

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ మహమ్మద్‌ అనే 25 ఏళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు. అయితే అబ్దుల్‌ను కిడ్నాప్‌ చేశామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్‌లోని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. 1,200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే అబ్దుల్‌ కిడ్నీ అమ్మేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.  అక్కడే క్లేవ్‌ల్యాండ్‌ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నాడు. అయితే అతడు మార్చి 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అమెరికాలోని అబ్దుల్‌ బంధువులు మార్చి 8న క్లీవ్‌ల్యాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విద్యార్థి కోసం లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అబ్దుల్‌ను గుర్తించడంలో సహాయం కోరుతూ అతడి కుటుంబం మార్చి 18న చికాగోలోని భారత కాన్సులేట్‌ను కూడా ఆశ్రయించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :