ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

'మ్యాడ్'కి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్'ను ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

'మ్యాడ్'కి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్'ను ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఎందరో యువ దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. 'డీజే టిల్లు', 'మ్యాడ్', 'జెర్సీ', 'టిల్లు స్క్వేర్' వంటి అద్భుతమైన చిత్రాలను దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన 'మ్యాడ్' చిత్రం 2023 అక్టోబరులో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌'ని రూపొందిస్తున్నారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్‌ మూవీ 'టిల్ స్క్వేర్‌'కి రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఇప్పుడు, ఆయన తన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్‌'తో రాబోతున్నారు. 'మ్యాడ్'లో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. కథానాయికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

'మ్యాడ్ నెస్' ఇంకా పూర్తి కాలేదు అని తెలిపిన మేకర్స్.. ఈసారి 'మ్యాడ్ నెస్' రెట్టింపు ఉంటుందని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే, ఈసారి కథానాయికల త్రయం చేసే అల్లరి.. థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించనుందని అర్థమవుతోంది. ఇటీవల ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 'డీజే టిల్లు'కి సీక్వెల్‌ గా రూపొందిన 'టిల్లు స్క్వేర్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో.. 'మ్యాడ్'కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :