ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సిలికానాంధ్ర తెలుగు వెలుగు

సిలికానాంధ్ర తెలుగు వెలుగు

భారతీయ సంస్కృతి. భారతీయతను, అందునా తెలుగుదన వైవిధ్య భరిత వారసత్వాన్ని సంరక్షించుకుంటూ తరాల మధ్య వారధిగా నిలుస్తూ. సంస్కృతీ రaరి కొనసాగడానికి సరైన స్ఫూర్తిని సిలికానాంధ్ర తన కార్యాచరణ ద్వారా అందిస్తోంది. 2001లో ప్రారభమైన సిలికానాంధ్ర నేడు జగమంత విస్తరించింది. అచ్చమైన తెలుగుతనాన్ని ఖండాంతరాలకు ‘సిలికానాంధ్ర’ (తెలుగు సాహితీ, సాంస్కృతిక, సంప్రదాయ స్ఫూర్తి) వ్యాపింపజేసింది. తనదైన శైలిలో నిర్వహిస్తున్న వినూత్న విశిష్ట సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలతో అప్రతిహతంగ ముందుకు సాగుతోంది. 8 గిన్నిసు రికార్డులు సాధించిన ఏకైక సాంస్కృతిక సంస్థగా గుర్తింపును పొందింది.

సిలికానాంధ్ర ఎన్నో మైలురాళ్ళను దాటింది. ఆంధ్ర సాంస్కృతి కోత్స వం, ఆంధ్ర కుటుంబ శిబిరం, అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవం, అన్నమయ్య జయంతి, అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం, వార్షికోత్సవాలు, సెమినార్‌లు, ఉగాది వేడుకలు ఇలా ఎన్నో, ఎన్నెన్నో కార్యక్రమాలతో సిలికానాంధ్ర విస్తరిస్తూ వస్తోంది. తెలుగు భాషను నేర్పించే మనబడి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వంటివి సిలికానాంధ్రకు పేరు తీసుకువచ్చాయి. అమెరికా దేశంలో తొలిసారిగా వేదాంతం రాఘవ, వేదాంతం వెంకటాచలపతి గార్ల నిర్దేశకత్వంలో కూచిపూడి యక్షగాన కార్యక్రమం, ‘‘ఉషా పరిణయం’’ వంటివి 21వ వార్షికోత్సవ వేడుకల్లో­­­­ ప్రదర్శించి అబ్బుర పరిచారు. రెండు దశాబ్దాల్లో సంస్థలో కీలక పాత్రలు పోషించిన నాయకులు, దిలీప్‌ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, మాడభూషి విజయసారధి, తనుగుల సంజీవ్‌ ప్రభృతులతోపాటు వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్‌ సిలికానాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు.

సిలికానాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలను చేసింది. ఏ కార్యక్రమం చేసినా అందులో తెలుగుదనం కనిపించేలా చేయడం సిలికానాంధ్రకే సాధ్యం అని  చెప్పుకునేలా చేసి చూపించింది. సిలికానాంధ్ర ఇప్పుడు అన్నీ చోట్ల విస్తరించింది. మనబడి కార్యక్రమాల ద్వారా తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తోంది. సంపద ద్వారా కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందూస్తాని మ్యూజిక్‌, కూచిపూడి, భరతనాట్యం వంటివి నేర్పిస్తోంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు భాష, సంస్కృతం, శాస్త్రీయసంగీతం, హిందూస్తానీ సంగీతం, కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసే అవకాశం కలిగింది. ఆయుర్వేదం, నేచురల్‌ మెడిసిన్‌ చదువుకు కూడా ఈ యూనివర్సిటీ అవకాశాన్ని కలిగించింది. ఇలాగే సిలికానాంధ్ర ఎన్నో కార్యక్రమాల ద్వారా గిన్నిస్‌ రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. అందుకనే సిలికానాంధ్ర లీడర్‌షిప్‌ కూడా ఒక కార్పొరేట్‌ సంస్థ లాగా ఏర్పాటు చేసుకున్నాము. నేను, రాజు చామర్తి సిఇఓలుగా సలహాలు ఇస్తూ అన్ని విభాగాలు సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేలా సంస్థని తయారు చేశాము. 

తెలుగు కమ్యూనిటికీ పత్రిక, పోర్టల్‌, యూట్యూబ్‌ ద్వారా మీడియా సేవలు అందిస్తున్న తెలుగు టైమ్స్‌కు 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :